Read more!

పన్నెండవరోజు పారాయణము చతుర్వింశాధ్యాయము

 

పన్నెండవరోజు పారాయణము

చతుర్వింశాధ్యాయము

 

 

అత్రి మహాముని చెబుతున్నాడు: అగస్త్యా! కార్తీకమాస శుక్ల ద్వాదశిని 'హరిభోధిని! అంటారు. ఆ ఒక్క పర్వతిధీ వ్రతాచరణం చేస్తే - అన్నీ తీర్ధాలలోనూ స్నానం చేసినా అన్ని విధాలైన యజ్ఞాలనూ ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువుపట్లా, యేకాదశిపట్లా భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పదీ, ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైనదీ అయిన ఈ ద్వాదశినాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది కోటిరెట్లుగా పరిణమిస్తుంది. అంటే - ఈ ద్వాదశినాడు ఒకరికి అన్నదానం చేసినా కోటిమందికి అన్నదానం చేసిన పుణ్యమూ, ఒక్క మెతుకు దొంగిలించినా - కోటి మెతుకులు దొంగిలించిన పాపమూ కలుగుతాయి. ఒ వేళ యే రోజుకైనా ద్వాదశీ ఘడియలు తక్కువగా వున్న పక్షంలో - ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలేగాని, ద్వాదశి దాటిన తరువాత పారణం _ పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారెవరైనా సరే ఏ నియమాన్నయినా అతిక్రమించవచ్చును గాని - ద్వాదశీ పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశీ తిథినాడు ఉపవాసం వుండి, మరునాడు ద్వాదశీ తిథి దాటి పోకుండా పారణ చేయాలి. తద్వారా కలిగే శ్రేయస్సుని శేషశాయి చెప్పాలేగాని - శేషుడు కూడా చెప్పలేడు. ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ.


అంబరీషోపాఖ్యానము

 

 

ద్వాదశీవ్రతాచరణ తత్పరుడూ, పరమ భాగవతోత్తముడూ అయిన అంబరీషుడనే మహారాజు - ఒకానొక కార్తీకశుద్ధ ఏకాదశినాడు ఉపవసించి, మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా వున్న కారణంగా, తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దుర్వాసమహర్షి వచ్చి - ఆనాటి ఆతిథ్యములో తనకు కూడా భోజనమును పెట్టవలసినదిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదశీపారణకు ఆహ్వానించాడు. తక్షణమే దుర్వాసుడు స్నానాద్యనుష్ఠానార్ధం నదికి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికీ మళ్లీ రాకపోవడంతో అంబరీషుడు ఆత్రుతపడ్డాడు. ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా వున్నాయి. కాలాతిక్రమణం కూడా కాకుండా పారణ చేసి తీరాల్సివుంది. అతిధి వచ్చేవరకూ ఆగడం గృహస్థ ధర్మం. దానిని వదలలేడు. ద్వాదశి దాటకుండా పాణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం. దీనిని వదులకోలేడు. అదీగాక.  

 

శ్లో || హరిభక్తి పరిత్యాగో ద్వాదశీత్యాగతో భవేత్
యతో2నుపోషితో భూయా త్కృత్వాసమ్య గుపోషణం
పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే
పాపముల్లంఘనేపాపాత్ నైవయుజ్యం మనీషిణా ||

 

 

 

 

 

'ద్వాదశీ వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు, విష్ణుభక్తిని విసర్జించినవాడవుతారు. ఏకాదశినాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశినాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతే కాదు - ఒక్క ద్వాదశీ పారణాతి క్రమణ వల్ల, ఆనాటి వ్రతఫలంతో బాటుగానే, అతః పూర్వం చేసిన పన్నెండు ద్వాదశీ పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మజన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశ్యతిక్రమణము వలన విష్ణు విరోధభీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావసానమయినా సరే, ద్వాదశీపారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణశాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగును గాక! దుర్వాసాగమనానంతరం కన్నా, ద్వాదశీ తిరోగమనాత్పూర్వమే పారణ చేసి - హరిభక్తిని నిలుపుకున్నట్లయితే - కలగబోయే కష్టాలను ఆ కమలనాధుడే కడతేరుస్తాడు. ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చీ కూడా, ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు, ద్వాదశీ పారణార్ధం తనను పరివేష్టించి వున్న వేదనిదులకు తన ధర్మసందేహాన్ని తెలియజేశాడు.

అంబరీషుని మనోవ్యధ:

 

 

 

అమరీషుని సమస్యను వినిన వేదస్వరూపులైన ఆ విప్రులు, క్షణాల మీద శ్రుతి స్మృతి శాస్త్ర పురాణదులన్నిటినీ మననం చేసుకుని "మహారాజా! సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులయందునా జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై వుంటున్నాడు. ఆ జఠరాగ్ని, ప్రాణవాయువుచేత ప్రజల్వింప చేయబడటం వలననే జీవులకు ఆకలి కలుగుతోంది. దానినే తాపమే క్షుత్పిపాసా బాధగా చెప్పబడుతూ వుంది కాబట్టి, యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవలక్షణం. జీవులచే స్వీకరించబడే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యరూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ వున్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే -  


శ్లో|| అథ శ్వపాకం శూద్రం వాస్వన్య సద్మాగతం శుభం
అతిక్రమ్య న భుంజీత గృహమే ధ్యతిథి౦, నిజమ్ ||

 

 


 

 

 



స్నానం చెయ్యకుండా భోజనమునుచేసేవాడు __ మలభోజి అవుతాడు. పరునికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు. తానాహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే బోజనమును చేసేవాడు __ ఆ శుద్ద౦లో పురుగువలే మలాశియే అవుతాడు. పక్వమైనది గాని, ఫలంగాని, పత్రంగానీ, నీల్లుగాని __ బోజనార్ధంగా భావించి సేవించిన దేదైనాసరే అన్నంతో సమానమే అవుతుంది. అందువలన నీచేత అంగీకృతుడైన అతిథిని __ నేను రాకుండానే, నాకంటే ముందుగా అన్న ప్రతినిదిగా జలపారణమును చేశావు. బ్రాహ్మణా రిస్కరమైన నువ్వు బ్రాహ్మణా ప్రియుడైన విష్ణువునకు భక్తుడివెలా అవుతావు? "యదా పురోధసన్స్వస్య మదమోహన్మహీనతే " నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా, మరో విధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు నువ్వు" అన్నాడు దుర్వాసుడు.

 

 

ఆ అగ్రహానికి భయకంపితుడైన అంబారీషుడు దోసలి నోగ్గినవాడై __"మునీంద్రా! నేను పాపినే! పరమ నీచుడనే అయినా నిన్ను శరణు కోతురున్నాను. నేను క్షత్రియుడను గనుక __ ఏ అభిజా త్యాహంకారము వల్లనో తప్పునో చేశాను, కాని, నువ్వు బ్రాహ్మణుడైన కారణముగా __ శాంతాన్ని వహించు. నన్ను రక్షించు. నీవంటి గొప్ప ఋషులు తప్ప __ మమ్మల్ని ఉద్దరించేవాళ్ళేవరు౦టారు?" అంటూ, అతని పాదాల మీదపడి ప్రార్ధించాడు. అయినా సరే ఆ దుర్వాసుని కోపం తగ్గలేదు. మణిమకుటాన్ని ధరించే ఆ అయోధ్యాపతి శిరస్సును తన ఎడమకాలితో తన్నివేసాడు. రవంత యెడంగావెళ్ళి  "ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్ధిస్తే వాళ్ళు శాంతులవుతారు. కాని, నేనలాంటివాడిని కాను, నాకు కోపం వస్తే, శాపం పెట్టకుండా వుండను. చేపగానూ, తాబేలుగానూ, పందిగానూ, మరుగుజ్జు వానిగానూ, వికృతమైనా ముఖం కలవానిగానూ, క్రూరుడైన బ్రాహ్మణునిగానూ, జ్ఞానశూన్యడైన క్షత్రుయునిగానూ, అధికారంలేని క్షత్రుయునిగానూ, దురాచార భూయిష్టమైన పాషండ మార్గవేదిగానూ, నిర్ధయా పూర్వక బ్రాహ్మణ హింసకుడైన బ్రాహ్మణునిగానూ_ పదిజన్మల (గర్భ నరకాల) ననుభవించు," అని శపించాను . అప్పటికే బ్రాహ్మణ శాపభయంతో అవాక్కయి వున్నాడు.

 

 

అబరీషుడు , అయినా అతని అంతరర్యంలో సుస్థితుడై వున్న శ్రీమహావిష్ణువు కల్పాంతరకాల లోకకళ్యాణార్దమూ, బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కారించకూడదనే తన వ్రతంవల్లా ఆ పదిజన్మల శాపాన్నీ తానె భరించదలచి __"గృహ్ణమి" అని వూతుకున్నాడు. "ఇన్ని శాపాలిస్తే __ గృహ్ణమి " అంటాడేమిటీ రాజు? వీనికిమ్కా పెద్దశాము యివ్వాలి" అని మరోసారి నోరు తెరవబోయాడు. దుర్వాసుడు __ కాని సర్వజ్ఞుడైన శ్రీహరి దుర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే __ భక్తుడైన అంబరీషుని రక్షాణార్ధ౦గా తన ఆయుధమైనా సుదర్శనాన్ని వినియోగించడంతో, అక్కడి పూజాస్థానంలో వున్న యంత్రాన్ని ఆవహించి __ జగదేక శరణ్యమూ, జగదేక భీకరమూ అయిన సుదర్శన చక్రము రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలలోంచి జడమైన విష్ణుచక్రం, దివ్యకాంతి ప్రభాశోభతమై తనవంకగా కదలి రావడాన్ని చూడగానే - దూర్వాసుడు త్రుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కగూడదని - భూచక్రమంతా గూడా క్షణాలమీద పరిభ్రమించాడు. అయినా 'సుదర్శనం' అతగాడిని తరుముతూనే వుంది. భీతావహుడైన ఆ దూర్వాసుడు - వశిష్ఠాది బ్రహ్మర్షులనీ, ఇంద్రాది అష్టదిక్పాలకులనీ, చిట్టచివరికి శివ-బ్రహ్మలనీ గూడా శరణుకోరాడు. కాని, అతని వెనకనే విహ్వల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తూన్న విష్ణుచక్రాన్ని చూసి - ఎవరికి వారే తప్పుకున్నారే తప్పవిడిచి, తెగించి యేవరూ అభయాన్నీయలేదు.
 

పంచవింశోధ్యాయ స్సమాప్తః (ఇరువది ఐదవ అధ్యాయము)

                     షడ్వింశా2ధ్యాయము

 

 



ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు - సంభవిత లోకాలన్నీ సంచరించి, చిట్టచివరగా - చక్రపాణియైన విష్ణువులోకాన్ని చేరాడు. 'హే బ్రహ్మణప్రియా! మాధవా! మధుసూదనా! కోటి సూర్యులతో సమానమైన కాంతిని - వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ వుంది. బ్రాహ్మణపాదముద్రా సుశోభిత మనోరస్కుడవైన నువ్వే నన్నీ ఆపదనుంచి కాపాడాలి' అని ఘోషిస్తూ - సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. 'దూర్వాసా! ప్రపంచానికి నేను దైవాన్నయినా - నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కాని, నువ్వు సద్బ్రాహ్మణుడవూ, రుద్రాంశ సంభూతుడవూ అయి వుండిగూడా - అంబరీషుణ్ణి అకారణముగా శపించావు. పారణకు వస్తానని చెప్పి, స్నానార్ధమై వెళ్ళిన నువ్వు - సకాలానికి చేరుకోలేదు - ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీ కోసం ఎదురుచూడకుండా, ద్వాదశీఘడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతినైనా ఈయలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్నిక్షణాలు మాత్రమే వ్యవధివున్న సమయంలో - వ్రత భంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనో - నిన్నవమానించాలనో కాదు. 'అనాహారేపి యచ్చస్తం శుద్ధ్యర్థం వర్ణినాం సదా' - నిషిద్దాహారులకు కూడా, జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతూండగా, అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆత్రేయా! నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించుమనీ వేడుకున్నాడేగాని, కోపగించుకోలేదు గదా! అయినా సరే, ముముక్షువైన అతగాడిని నువ్వు - పది దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడంకోసం నీ శాపాన్నీ నిమిషంలో త్రిప్పివేయగలను. కాని, బ్రాహ్మణవాక్యము వట్టిపోయిందనే లోకాపవాదము. నీకు కలగకుండా ఉండడం కోసం - ఆ భక్తుని హృదయములో చేరి, నీ శాపాన్ని సవినయంగా స్వీకరించినవాడినీ, నీ శాపాన్ని అంగీకరిస్తూ 'గృహ్ణామి' అన్నవాడినీ నేనేగాని, ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు.

 


ఋషిప్రభూ! నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకూ, శిష్యుడైన మనువునుద్ధరించేందుకూ మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించేవేళ, మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా వుండేందుకుగాను కూర్మావతారుడ (తాబేలు) నవుతాను. భూమిని ఉద్దరించేందుకూ, హరిణ్యాక్షుణ్ణి చంపేందుకూ, వరాహాన్నవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వికృతాననం గల 'నరసింహ' రూపావతార దారుడినవుతాను. సర్వదేవతా సంరక్షణకోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక 'బలి' అనే వాడిని శిక్షించేందుకు వామనుడనవుతాను. త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మదులైన రాజులను దుళ్ళగొడతాను. రావణ సంహారార్ధమై ఆత్మజ్ఞానశూన్యుడైన అంటే నేనే భగవంతుడనే దానిని మర్చిపోయిన - మాయామానుష విగ్రహుడైన దశరథ రామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానినీ, బలవంతుడను అయి వుండీ కూడా - రాజ్యాధికారం లేకుండా రాజు (బలరాముడు)కు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలుయుగారంభాన పాపమోహము కొరకు పాషండమత ప్రచారకూడనై బుద్దుడనే పేరున పుడతాను. ఆ యాగంతన శత్రుఘాతుకుడైన - బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను, దుర్వాసా! నా యీ దశావతారాలనూ - ఆయా అవతారాలలోని లీలలనూ ఎవరు వినినా, చదివినా తెలుసుకున్నా - వారి పాపాలు పటాపంచలవుతాయి.



శ్లో|| ధర్మానానా విధా వేదే విస్తృతా వరజన్మనాం
దేశకాల వయోవస్థా వర్ణాశ్రమ విభాగశః ||



దేశ, కాల, వయో 2అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను ననుసరించీ - 'ధర్మము' అనేక విధాలుగా వేదముచే ప్రవచింపబడి వుంది. అటువంటి వివిధ విధ ధర్మాలలోనూ కూడా 'ఏకాదశి' నాడుపవాసం. ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకుగాను - నువ్వా అంబరీషుణ్ణి శపించింది చాలక, తిరిగి మరో ఘోరశాపమును ఇవ్వబోయావు. బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యము చేయడమూ - భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడమూ రెండూ నా బాధ్యతలే గనక - పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను.

     

ఏవం శ్రీ స్కాంద పురాణంతర్గత కార్తీక మాహత్మ్యేషడ్వింషాధ్యాయ: సమాప్త:
(ఇరువది నాలుగు - ఇరువది ఐదు - ఇరువది ఆరు అధ్యాములు)


12 వ రోజు

నిషిద్ధములు  :- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి

దానములు :- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ

పూజించాల్సిన దైవము :- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు

జపించాల్సిన మంత్రము :- ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా

ఫలితము :- బంధవిముక్తి, జ్ఞానం, ధన ధాన్యాలు 



పన్నెండవ (ద్వాదశి) నాటి పారాయణము సమాప్తము