అధికమాసంలో ఏమీ చేయకున్నా కనీసం ఈ శ్లోకాన్ని పఠిస్తే చాలు!

 

అధికమాసంలో ఏమీ చేయకున్నా కనీసం  ఈ శ్లోకాన్ని పఠిస్తే చాలు!


జ్యేష్ఠ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు.  జ్యేష్టమాసం అదికమాసం కాబట్టి ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని చెబుతారు. జ్యేష్టమాసంలో మొత్తం మహావిష్ణు ఆరాధన చేయాలని చెబుతారు.  అందుకే ఈ మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు వచ్చింది.  ఈ మాసంలో దైవ ఆరాధన,  దానాలు,  దేవాలయ దర్శనానికి చాలా ప్రాముఖ్యత ఉంది.  ఇవన్నీ చేయలేకపోయే వారు జ్యేష్ఠ పుణ్యఫలం పొందాలంటే ప్రతిరోజూ ఒక మంత్రం పఠిస్తే చాలు.. ఆ మంత్రమేంటి? జ్యేష్ఠ మాస ప్రత్యేకత ఏంటి తెలుసుకుంటే..

జ్యేష్ఠ మాసం అధికమాసం. ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన,  దేవాలయ దర్శనం,  దానాలు చేయడం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తాయి. జ్యేష్టమాసంలో 33రూపాయలు దానం చేయడం,  దేవాలయంలో 33 ప్రదక్షిణలు చేయడం,  33 రకాల దానాలు చేయడం,  33 దీపాలు వెలిగించడం వంటివి చేస్తుంటారు.  ఇవన్నీ కుదరని వారు ప్రతిరోజూ 33 సార్లు కింద చెప్పుకున్న శ్లోకాన్ని పఠించాలి.

శ్లోకం..

గోవర్ధనx ధరం వందే
 గోపాదం గోపరూపిణం|
గోకులోద్భవ ఈశానం
గోవిందం గోపికా ప్రియం|

పైన చెప్పుకున్న శ్లోకాన్ని అధికమాసంలో ఎలాంటి పూజలు,  దానాలు వంటివి చేయలేకపోయినా ప్రతి రోజూ 33 సార్లు చెప్పుకోవాలి.  ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత ఇలా 33సార్లు చెప్పుకోవడం వల్ల అధికమాసంలో చేయాల్సిన దానాలు,  దీపారాధన,  ప్రదక్షిణ, ఆలయ దర్శన ఫలితం అంతా లభిస్తుంది.

                              *రూపశ్రీ.