ఏడువారాల నగలంటే తెలుసా ...

 

ఏడువారాల నగలంటే తెలుసా ...

 


 నగలంటే ఇష్టపడని స్త్రీలు ఎవరూ వుండరు. అలాంటి నగల గురించి తెలుసుకోవటం, ధరించటం అందరికీ నచ్చే విషయం. అయితే నగలు ఎన్నో రకాలు వున్నా ప్రత్యేకించి ఏడువారాల నగలు అని  సినిమాల్లో, పెద్దల మాటల్లో, కథల్లో వింటు వుంటాం.   అవి ఏంటో, ఏయే రోజుల్లో ఏవి ధరించాలో ఈ రోజు తెలుసుకుందాం.

 



ఆయా వారాన్ని బట్టి ఆ రోజుకి వుండే గ్రహాధిపతిని అనుసరించి ఏ నగలు ధరించాలో చెప్పబడ్డాయి.
అలా ఆదివారం సూర్యనికిష్టమైన రోజు కాబట్టి ఆ రోజున కెంపులతో చేసిన నగలు, హారాలు, కమ్మలు ధరించాలి.


చంద్రునికి ఇష్టమైంది సోమవారం. ఆ రోజున ముత్యాల హారాలు, ముత్యాల గాజులతో అలకరించుకోవాలి.

మంగళావారం కుజుడికిష్టమైనది. ఆ రోజున పగడాలతో చేసిన నగలు పెట్టుకోవాలి.

బుధుడికిష్టమైనది బుధవారం. ఆ రోజు ఆయనకిష్టమైన పచ్చల హారాలు, గాజులు వేసుకోవాలి.
గురువారం బృహస్పతిది. అందుకే గురువారం రోజు పుష్పరాగంతో చేసిన కమ్మలు, ఉంగరాలు ధరించాలి.


శుక్రవారం శుక్రుడికిష్టమైనది ఆ రోజు. అందుకే ఆ రోజు వజ్రాల హారాలు, ముక్కుపుడుక ధరించి లక్ష్మీదేవిలా దర్శనమివ్వాలి.


శనివారం శనిభగవానుడికి ఇష్టమైనది కాబట్టి ఆ రోజున ఆయనకిష్టమైన నీలమణి నగలు ధరించాలి. నీలంతో చేసిన కమ్మలూ, నగలు, ముక్కుపుడుకా పెట్టుకోవాలి.


నవరత్నాలతో పాపిడ బిళ్ల, వంకీలూ ఇలా ఎన్నయినా చేయించుకోవచ్చు. ఇలా నవరత్నాలతో కూడిన నగలు, వారానికి అనుగుణంగా అలకరించుకోవడం కన్నా స్త్రీకి గొప్ప వైభోగం ఇంకోకటి వుండదు.