క్షుర కర్మ విషయంలో సందేహాలా!
క్షురకర్మ విషయంలో సందేహాలా!
వీలు కుదిరినప్పుడు తిథి వారం కుదురుతుందో లేదో అని సందేహించే సమస్యలలో ఒకటి క్షురకర్మ. క్షవరం చేయించుకోవడానికి వెళ్లాలంటే ఇంట్లో వాళ్లో, తెలిసిన వాళ్లో ఏదో ఒక అనుమానం వ్యక్తం చేస్తుంటారు. ఆ సందేహాలకు సమాధానం ఇదిగో..
క్షురకర్మ చేయుంచుకోవడానికి తగిన వారాలు
బుధవారం, గురువారం, సోమవారం మంచిది.
ఈ క్రమ పద్దతిని పాటించండి
మొదట గడ్డం గీయించుకున్న తర్వాత చంకలూ, ఆ తర్వాత తల క్షౌరం చేయించుకోవాలి. ఇలా చేయించుకోవడం వల్ల కుటుంబ వృద్ధి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
గోళ్లు, మీసాలు, రోమాలూ, ప్రతి అయిదు రోజులకొకసారి కత్తిరించుకోవాలి.
క్షుర కర్మకు తగని తిథి, వారాలు
ఆదివారం, శనివారం ఈ కర్మ చేయించుకోకూడదు.
అలాగే క్షురకర్మ పాడ్యమీ, చవితీ, షష్ఠి, అష్టమీ, నవమీ, అమావాస్య, పౌర్ణమి తిథులందు చేయకూడదు.
గుర్తుంచుకోండి...
ముక్కులోని వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. దాని వల్ల కంటికి ఇబ్బంది. మనం పీల్చే గాలిలో అనేక విషక్రిములుంటాయి వాటిని పసిగట్టి, ఆపి, మంచిగాలిని పంపించేందుకు ముక్కులోని వెంట్రుకలు ఉపకరిస్తాయి. అలాంటి వాటిని అందం కోసం కత్తిరించకూడదు.