నియమాలను ఉల్లంఘించకుండా... (Should not break rules)

 

నియమాలను ఉల్లంఘించకుండా...

(Should not break rules)

దుష్కులీనః కులీనోవా మర్యాదాం యో నాలంఘయేత్

ధర్మాపేక్షో మృదువర్తమాన్ సకులీన్ శతాద్వరః

ఏ వంశంలో పుట్టారన్నది ముఖ్యం కాదు. నియమాలను ఉల్లంఘించకుండా, మృదుస్వభావంతో మెలుగుతూ, శ్రద్ధాసక్తులతో తన కర్మలను సవ్యంగా ఆచరిస్తూ, ధర్మాన్ని అనుసరించి నడచుకుంటూ, తప్పు చేయడానికి వెరచి, సిగ్గుపడటం - ఇదీ సజ్జనుల లక్షణం. మంచి కులంలో పుట్టిన వారి కంటే, ఏ కులంలో పుట్టినా సద్గుణాలతో మెలిగే వ్యక్తులనే ఉత్తమలుగా పరిగణించాలి.

కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా కులం కంటే గుణమే గొప్పది.