మార్గశిర మాసంలో నదిలో స్నానం చేయొచ్చా.. చేయకూడదా!
మార్గశిర మాసంలో నదిలో స్నానం చేయొచ్చా.. చేయకూడదా!
డిసెంబర్ 13 నుంచి మార్గశిర మాసం ప్రారంభం అవుతోంది. మార్గశిర మాసంలో నదీ స్నానం, దానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ మాసంలో నదిలో స్నానం చేయడం చాలా ముఖ్యం. మార్గశిర మాసంలో యమునా నదిలో స్నానం చేయడం వల్ల భగవంతుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చని చెబుతారు. కావున, తమ జీవితంలో భగవంతుని అనుగ్రహాన్ని నిలబెట్టుకోవాలనుకునే వారు, కష్టాల నుండి విముక్తి పొందాలనుకునే వారు మార్గశిర సమయంలో కనీసం ఒక్కసారైనా నదిలో స్నానానికి వెళ్లాలి. కానీ ఎవరికి అలా చేయడం సాధ్యం కాదు, వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా పవిత్రమైన గంగాజలం నీటిని కలిపి ఇంట్లో స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు 'ఓం నమో భగవతే నారాయణాయః' లేదా గాయత్రీ మంత్రాన్ని కూడా జపించాలి.
మార్గశిర మాసంలో చేయాల్సిన పరిహారాలు:
-మార్గశిర మాసంలో వేకువజామున నిద్రలేచి, స్నానమాచరించి శుద్ధి పొంది భగవంతుని ధ్యానించి పూజించాలి. ఇలా చేయడం వల్ల వ్యక్తి , మానసిక శక్తి చాలా బాగుంటుంది.
-ఈ మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించాలి. అలా చేయలేని వారు మార్గశిర మాసంలో ఇంట్లో దేవుని దగ్గర కూర్చుని మంత్రాలను జపించాలి. ఇలా చేయడం ద్వారా మీరు ఇంట్లో కూర్చొని వివిధ తీర్థయాత్రలలో జపం చేసిన ఫలితాలను పొందవచ్చు.
- మీరు వ్యాపారంలో విజయం సాధించాలంటే, ఈ మాసంలో మీరు ప్రతి రోజూ 108 సార్లు 'ఓం అచ్యుతాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
- మీరు మీ పని సఫలం అవ్వాలంటే, మార్గశిర మాసంలో మీరు 'ఓం అనంతాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
-మీరు మీ వైవాహిక బంధాన్ని ప్రేమతో నింపాలనుకుంటే, ఈ మాసంలో మీరు 'ఓం మధుసూదనాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
- ఉద్యోగంలో మంచి ఆదాయం రావాలంటే ఈ మాసంలో 'ఓం గోవిందాయ నమః' అనే మంత్రాన్ని ప్రతి రోజూ 108 సార్లు జపించాలి. అలాగే, చిన్న పిల్లలకు బట్టలు బహుమతిగా ఇవ్వాలి.
-మీరు మీ పనితో అందరినీ మెప్పించాలనుకుంటే, మీరు మార్గశిర మాసంలో 'ఓం త్రివిక్రమాయ నమః' అనే మంత్రాన్ని ప్రతి రోజూ 108 సార్లు జపించాలి.
- మీరు అందరితో సంబంధాలలో సామరస్యాన్ని నెలకొల్పాలనుకుంటే, ఈ మాసంలో మీరు 'ఓం మాధవాయ నమః' అనే మంత్రాన్ని ప్రతి రోజూ 108 సార్లు జపించాలి. అలాగే ఇంటి పెద్దల ఆశీస్సులు కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి.
- మీరు మీ ఏదైనా ప్రత్యేక కోరికను నెరవేర్చుకోవాలనుకుంటే, మార్గశిర మాసంలో మీరు 'ఓం నమో భగవతే నారాయణాయ' అనే మంత్రాన్ని ప్రతి రోజూ 108 సార్లు జపించాలి. అలాగే గుడిలో కొన్ని దానధర్మాలు చేయాలి.
-మీరు రాజకీయ రంగంలో నిలదొక్కుకోవాలంటే మార్గశిర మాసంలో 'ఓం దామోదరాయై నమః' అనే మంత్రాన్ని ప్రతి రోజూ 108 సార్లు జపించాలి.
- మీరు విద్యా రంగంలో మీ విజయాన్ని పొందాలనుకుంటే, మీరు మార్గశిర మాసంలో 'ఓం కేశవాయ నమః' అనే మంత్రాన్ని ప్రతి రోజూ 108 సార్లు జపించాలి. అలాగే విద్యా యంత్రాన్ని ఏర్పాటు చేయాలి.
-మీరు మీ ఆరోగ్యం మెరుగుపడాలంటే, ఈ మాసంలో మీరు 'ఓం పద్మనాభాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి. అలాగే దేవాలయంలో పండ్లను దానం చేయాలి.
- మీ ఇంట్లో సుఖశాంతులు, శాంతి నెలకొనాలంటే మార్గశిర మాసంలో 'ఓం హృషీకేశాయ నమః' అనే మంత్రాన్ని ప్రతి రోజూ 108 సార్లు జపించాలి. అలాగే దేవుడికి తాజా పుష్పాలను సమర్పించాలి.
- మీరు రుణ విముక్తులు అవ్వాలంటే ఈ మాసంలో మీరు 'ఓం శ్రీధరాయ నమః' అనే మంత్రాన్ని ప్రతి రోజూ 108 సార్లు జపించాలి. అలాగే సాయంత్రం పూట తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి.