లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టాలంటే..

 

లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టాలంటే..


దారిద్ర్యం తొలిగి లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టాలంటే ఏం చెయ్యాలి అనే సందేహం చాలామందికి వుంటుంది. ఇళ్లు, అలవాట్లలో వున్న దారిద్రమే అలక్ష్మీ నివాసం. అందుకే ఇల్లు పవిత్రంగా, పరిసరాలు శుభ్రంగా వుంటే లక్ష్మీదేవి నడిచి వస్తుంది. గుమ్మానికి ఎదురుగా చెప్పులు వుంటే ఇల్లు అందంగా వుండదు. చెప్పులకున్న చెడు వలన క్రిములు, కీటకాలు చేరుతాయి. అంతా చెత్తగా వున్నప్పుడు అనారోగ్యం, అనారోగ్యంతో డబ్బులు, ఆరోగ్యం మనశ్శాంతి పోతాయి. ఇంతకన్నా దారిద్య్రం ఏం వుంటుంది. అలాగే ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేయక పోవడం, చెత్త ఇంట్లోనే వుంచుకోవటం, అంట్లూ చాలా సేపు తోమకుండా వుండటం ఇవన్నీ లక్ష్మీ దేవి మన ఇంటికి రాకుండా అడ్డుపడే అంశాలే. ఆవిడ అపరిశుభ్రంగా వున్న ఇంట అడుగుపెట్టదు. లక్ష్మీదేవిని ఆహ్వానించాలన్నా, దరిద్ర దేవతను పారద్రోలాలన్నా శుభ్రత, నియమాలు పాటించడం ఒక్కటే మార్గం..