వినాయక చవితి (Vinayaka Chavithi)
వినాయక చవితి
(Vinayaka Chavithi)
''పూవుల్లోన రాజా పూవు.. రోజా పూవు..'' అంటూ పిల్లలు వల్లిస్తుంటారు. అలా పండుగల్లో తలమానికమైన పండుగ అంటే అది ఖచ్చితంగా వినాయక చవితి. ఇతర ఏ పండుగలు జరుపుకున్నా, లేకున్నా ఈ పండుగని మాత్రం అందరూ జరుపుకుంటారు. అది కూడా ఎంతో ఇష్టంగా.
పొద్దున్న లేస్తూనే స్నానాలూ జపాలూ పూర్తిచేసి పత్రి కోసం బయల్దేరతారు. కొండంత దేవుడికి కొండంత పత్రి సమర్పించలేకపోయినా వీలైనన్ని ఎక్కువ రకాల ఆకులు, పుష్పాలూ సేకరించి భక్తిగా విఘ్నేశ్వరునికి సమర్పించుకుంటారు. వినాయక చవితి జరుపుకుంటే చదువుసంధ్యలు, వృత్తి ఉద్యోగాలు వేటిల్లోనూ ఆటంకం రాదనీ, అన్నీ నిర్విఘ్నంగా జరిగిపోతాయని చెప్తారు పెద్దలు.
వినాయక చవితి ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం...
ముందుగా ఇంటిని శుభ్రం చేసుకుని, కుటుంబసభ్యులంతా తలంటుకోవాలి. గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టాలి. వాకిళ్ళను అలంకరించాలి. దేవుని గదిలో కడిగి, పసుపు రాసిన పీట ఉంచి, దానిపై కొన్ని బియ్యం వేసి, మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి. తెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో వుంచాలి.
పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, దాన్ని విఘ్నేశ్వరుని తలపై వచ్చేలా తాళ్ళు కట్టి మేకుకు తగిలించాలి. పాలవెల్లిలో అనేక రకాల ఆకులు, పుష్పాలు, కాయలు, పండ్లు అందంగా అలంకరించాలి.
వినాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములు చాలా ఇష్టం. గారెలు, పాయసం మొదలైన పిండి వంటలతో బాటు ఉండ్రాళ్ళు, కుడుములు తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొన్ని బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసి, కొబ్బరికాయ ఉంచి, కలశాన్ని ఏర్పాటు చేయాలి.
తర్వాత పసుపు ముద్దతో పసుపు గణపతిని తయారు చేసుకోవాలి, పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్దరిణ వుంచుకుని పక్కన పళ్ళెం పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి అంటే పసుపు కుంకుమలను తుడుచుకునేందుకుఒక వస్త్రాన్ని వుంచుకుంటే బాగుంటుంది.
పూజకు కావలసిన సామగ్రి
పసుపు, కుంకుమ, గంధం, అగరువత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూల దండలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం లేదా పంచదార, పంచామృతం, తోరం, దేపారాధన కుందులు, నెయ్యి, నూనె, దీపారాధన వత్తులు, వినాయకుడి ప్రతిమ 21 రకాల ఆకులు, ఉండ్రాళ్ళు, కుడుములు,పాయసం.
వినాయక పూజ
ఆచమ్యః ఓం కేశవాయ స్వాహా – ఓం నారాయణాయ స్వాహా – ఓం మాధవాయ స్వాహా – ఓం గోవిందాయ నమః – విష్ణవే నమః – మధుసూదనాయ నమః – త్రివిక్రమాయ నమః – వామనాయ నమః – శ్రీధరాయ నమః – హృషీకేశాయ నమః – పద్మనాభాయ నమః – దామోదరాయ నమః సంకర్షణాయ నమః – వాసుదేవాయ నమః – ప్రద్యుమ్నాయ నమః – అనిరుద్దాయ నమః – పురుషోత్తమాయ నమః – అధోక్షజాయ నమః – నారసింహాయ నమః – అచ్యుతాయ నమః – జనార్ధనాయ నమః – ఉపేంద్రాయ నమః – హరయే నమః – శ్రీకృష్ణాయ నమః
వినాయక ప్రార్ధన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే త్సరవిఘ్నేపశాంతయే
సముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోధరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరమ్భః స్కన్ద పూరజః
షోడశైతాని నామాని యః పఠేచ్చ్రణుయా దపి,
విద్యారమ్భే వివాహే ఛ ప్రవేశే నిర్గమే తథా
సగ్జ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య సజాయతే.
సభీప్సితార్దద్ధ్యర్ధం పూజితో యస్సురైరపి
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమః
సంకల్పం
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభేశోభనే మొహుర్తే అద్యబ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే , కలియుగే ప్రథమ పాదే, జంబుద్వీపే, భరతవర్షే, భతర ఖండే మేరోర్ధక్షిణ దిగ్భాగే (ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) అస్మిన్ వర్తమాన హ్యావహారిక చంద్రామానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ... (సంవత్సరం పేరు చెప్పాలి) నామ సంవత్సరే దాక్షిణాయనే, వర్షఋతౌ, భాద్రపదమాసే, శుక్లపక్షే చతుర్ధ్యాం తిథౌ... వాసరయుక్తాయాం, శుభ నక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, అస్మాకం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివ్రుద్ధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఇష్టఅమ్యార్ధం, మనోవాంఛఫల సిద్ధ్యర్ధం, సమస్త దురితోప శాంత్యర్ధం, సమస్త మంగళావాప్త్యర్ధం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్ధీ ముద్ధిశ్య, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్తప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడసోపచార పూజాం కరిష్యే (నీళ్ళను తాకాలి)
అదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్ధం గణాధిపతి పూజాంకరిష్యే! తదంగ కలశపూజాం కరిష్యే కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య తస్సోపరి హస్తం నిధాయ.
కలశపూజ
కలశం గంధపుష్పాక్షతై రభ్యర్చ్య (కలశమునకు గంధపు బొట్లు పెట్టి అక్షతలద్ది లోపల నొక పుష్పము నుంచి తదుపరి ఆ పాత్రను కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రములను చదవాలి.
కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మ్రతాః
కుక్షౌతు సాగరాః సరే సప్తదీపా వసుంధరా
ఋగ్వేదో విధ యజుర్వేదం సామవేదో హ్యథర్వణః
అంగైశ్చ సహితాః సరే కలశాంబు సమాశ్రితాః
ఆయాస్తు దేవ పూజార్ధం దురితక్షయకారకాః
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధుకావేరీ జలేవి స్మిన్ సన్నిధిం కురు
కలశోదకేన పూజాద్రవ్యాణి దేవమండల మాత్మానం చ సంప్రోక్ష్య.
(కలశమందలి జలమును చేతిలో పోసుకుని,
పూజా వస్తువులపై, దేవుని మండపంలో, తన తలపై చల్లుకోవాలి)
తదంగతేన వరసిద్ధివినాయక ప్రాణప్రతిష్టావనం కరిష్యే.
ఇప్పుడు వసుపుతో వినాయకుడి తయారు చేసుకోవాలి.
మహా (పసుపు) గణాధిపతి పూజ
గణాంత్వాం గణపతిగ్ హవామహే కవింకవీనా ముపమశ్రవస్తామం,
జ్యేష్టరాజం బ్రాహ్మణ, బ్రహ్మనస్పత్యః ఆనశృణ్వన్నూతిభిస్సీద సాధనం
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యానావాహనాది షోడశోపచార కారిష్యే
(పూలు, అక్షతలు కలపాలి)
శ్రీ మహాగణాధిపతి స్సుప్రసన్నో, సుప్రీతో, వరదోభవతు
శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసాగృహ్ణమి
(రెండు అక్షతలు తలపై వేసుకోవాలి)
అథ శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపానం కరిష్యే
ప్రాణ ప్రతిష్ట
మం!! అసునీతే పునరాస్మాసు చక్షు:
పునః ప్రాణ మిహనో ధేహి భోగమ్,
జ్యోక్పశ్యేషు సూర్య ముచ్చరంత
మనుమతే మ్పడయాన సస్తి.
అమృతం వై ప్రాణా అమృత మాపః ప్రాణానేవ యథాస్థాన ముపహయతే.
స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్!
తావత్వం ప్రీతిభావేన బిందేస్మిన్ సన్నిధిం కురు!!
ఆవాహితో భవ, స్థాపితో భవ, సుప్రసన్నోభవ, వరదో భవ
అవకుంఠితో భవ, స్థిరాసనం కురు, ప్రసీద ప్రసీద.
పూజా విధానం
శ్లో! భవసంచితపాపౌఘవిధ్వంసవిచక్షణం!
విఘ్నాంధకారభాసంతం విఘ్నరాజ మహం భజే!!
ఏకదస్తం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం!
పాశాంకుశధరం దేవం ధ్యాయే త్సిద్ధివినాయకమ్!!
ఉత్తమం గణానాథస్యవ్రతం సంపత్కరం శుభం!
భక్తాభీష్టప్రదం తస్మాద్ద్యాయే త్వం విఘ్ననాయకమ్!!
ధ్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం!
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితమ్!!
శ్రీ వరసిద్ధివినాయకం ధ్యాయామి.
అత్రా విగచ్చ జగదంద్య సురరాజార్చి తేశ్వర!
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ!!
శ్రీ వరసిద్ధి వినాయకం ధ్యాయామి.
మౌక్తికైః పుష్పరాగైశ్చ నానార త్నై ర్విరాజితం!
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్!!
శ్రీ వరసిద్ధి వినాయకం ఆసనం సమర్పయామి
గౌరీపుత్ర! సమస్తేస్తు శంకర ప్రియనందన!
గ్రహాణార్ఘ్య మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం!
శ్రీ వరసిద్ధివినాయకాయ అర్ఘ్యం సమర్పయామి
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక!
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ దిరదాసన!
శ్రీ వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి
అనాథనాథ సరజ్ఞ గీర్వాణవరపూజిత!
గృహాణచమనం దేవ! తుభ్యం దత్తం మయా ప్రభో
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆచమనీయం సమర్పయామి.
దధిక్షీరసమాయుక్తం మధాహ్హ్యేన సమన్వితం
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర సమోస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయకాయ మధుపర్కం సమర్పయామి
స్నానం పంచామృతై ర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ! సర్వజ్ఞ గీర్వాణగణపూజిత
శ్రీ వరసిద్ధి వినాయకాయ పంచామృతస్నానం సమర్పయామి.
గంగానది సర్వతీర్ధ్యేభ్య ఆహృతై రమలైర్జలై:
స్నానం కురుష భగవ స్నుమాపుత్త్ర సమోస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయాకం శోద్దోదక స్నానం కారయామి
రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానా మిష్టదాయక
వరసిద్ధివినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి
చందనాగురుకర్పూరకస్తూరీకుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ట! ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్
శ్రీ వరసిద్ధి వినాయకం గంధం ధారయామి.
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే
శ్రీ వరసిద్ధివినాయకాయ అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి.
సుగన్ధాని చ పుష్పాణి జాజీకుందముఖానిచ
ఏకవింశతిపత్రాణి సంగ్రహాణ నమోస్తుతే
గణనాయకుని పూజ
గణేశాయ నమః పాదౌపూజయామి!!
ఏకదంతాయ నమః గులౌపూజయామి!!
శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి!!
విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి!!]
అఖువాహనాయ నమః ఊరూ పూజయామి!!
హేరంబాయ నమః కటిం పూజయామి!!
లంబోదరాయ నమః కటిం పూజయామి!!
గణనాథాయ నమః హృదయం పూజయామి!!
స్థూలకంఠాయ నమః స్కంధౌ పూజయామి!!
పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి!!
గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి!!
విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి!!
శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి!!
ఫాలచంద్రయ నమః లలాటం పూజయామి!!
సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి!!
విఘ్నరాజాయ నమః సర్వాంగాని పూజయామి!!
ఇప్పుడు వినాయకుని ఆవిర్భావం, శమంతకమణి కథ చదువుకుని తలపై అక్షతలు జల్లుకోవాలి.
ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారం పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకుంటే సరిపోతుంది.
పార్వతీ నందనా నీకు వందనం!
Click Here Vinayaka Chavathi Special Recipes