పాముకాటుకన్నా చాడీ ప్రమాదం
పాముకాటుకన్నా చాడీ ప్రమాదం!
అహో ఖలభుజంగస్య విచిత్రోయం వధక్రమః
అన్యస్య దశతి శ్రోత్ర మన్యః ప్రాణైర్విముచ్యతే॥
చాడీలు చెప్పేవారు విషనాగులకన్నా భయంకరమైనవారు. వీరు ఎదుటివారి మీద పగ తీర్చుకునే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. పాము ఎవరినైతే చంపాలనుకుంటుందో వారినే కాటేస్తుంది. కానీ మనం చెప్పే చాడీలు వేరొకరి మృత్యువుకి దారి తీస్తాయి.