ఇలా మాట్లాడాలి
ఇలా మాట్లాడాలి!
హితం మితం ప్రియం కాలే వశ్యాత్మాయోభిభాషతే।
స యాతి లోకానాహ్లాద హేతుభూతాన్ నృపాక్షయాన్॥
మనం మాట్లాడే మాట అవతలి వారికి మేలు చేయాలి; హద్దులు దాటకుండా మితంగా మాట్లాడాలి; అవతలివారి మనసుని గాయపరిచేదిగా ఉండకూడదు; సందర్భానికి తగినట్లుగా ఉండాలి... ఇలాంటి మాటలు మాట్లాడేవాడు ఉత్తమలోకాలకు వెళ్తాడు.