అవమానాన్ని ఎదుర్కోరు
అవమానాన్ని ఎదుర్కోరు
యదచేతనో-పి పాదైః స్పృష్టః ప్రజ్వలతి సవితు రినకాంతః ।
తత్తేజస్వీ పురుషః పరకృతనికృతిం కథం సహతే ॥
సూర్యకాంత మణి చూసేందుకు చాలా సాధారణంగా ఉంటుంది. కానీ సూర్యకిరణాలు పడగానే ఒక్కసారిగా ప్రజ్వరిల్లుతుంది. తేజస్వులైన మనుషుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. పైకి చూసేందుకు వారు చాలా అణకువతో ఉంటారు. కానీ అవమానకరమైన సందర్భాలను ఎదుర్కొన్నప్పుడు భగ్గుమని మండుతారు.
..Nirjara