తత్వవిచారం చేసేవాడు
తత్వవిచారం చేసేవాడు
వారిజపత్రమందిడిన వారివిధంబున వర్తనీయమం
దారయ రొంపిలోన దనువంటని కుమ్మర పుర్వురీతి సం
సారమునన్ మెలంగుచు విచారగుఁడై పరమొందుగాదె స
త్కారమెఱింగి మానవుఁడు దాశరథీ! కరుణాపయోనిధీ!
నీటిలో ఉన్నా కూడా తామరాకుకి తడి చేరదు. నిరంతరం బురదలో పొర్లాడినా కుమ్మరి పురుగు ఒళ్లు నిగనిగలాడుతూనే ఉంటుంది. అలాగే తత్వవిచారం చేసే మనిషి, సంసారంలో ఉన్నా కూడా మోక్షం దిశగానే సాగుతాడు.
...Nirjara