Read more!

కోతి చెట్టెక్కితే

 

 

 

కోతి చెట్టెక్కితే

 

 

పండితులైనవారు దిగు వందగ నుండగ నల్పుడొక్కడు

ద్దండత బీఠమెక్కిన బుధ ప్రకరంబుల కేమి యెగ్గగున్?

గొండొక కోతి చెట్టుకొన కొమ్మల నుండగ గ్రింద గండభే

రుండమదేభ సింహనికురుంబము లుండవె చేరి భాస్కరా!

 

పండితులందరూ కింద కూర్చుని ఉండగా... అల్పుడు మాత్రం ఏమాత్రం సంకోచం లేకుండా, మదమెక్కి ఉన్నత ఆసనం మీద కూర్చుంటాడు. కానీ దాని వలన పండితులకు ఎలాంటి లోపమూ కలగదు. కోతి చెట్టుకొమ్మ మీదకి ఎక్కి కూర్చున్నంత మాత్రాన దాని కింద ఉన్న గండభేరుండములాంటి మృగాలకు లోటు కలగదు కదా!

 

..Nirjara