Difficult to understand
మనసును అర్ధం చేసుకోవడం...
Difficult to understand
ఔదుంబరాణి పుష్పాణి శ్వేతవర్ణం చ వాయసం
మత్స్యపాదం జలే పశ్యేన నారీ హృదయ స్థితిం
మేడిచెట్టు పూలను, తెల్లటి కాకులను, నీళ్ళలో చేపల అడుగుల గుర్తులను చూడటం సాధ్యమౌతుంది కానీ, స్త్రీ మనుసును అర్ధం చేసుకోవడం మాత్రం వీలవదు అనేది ఈ శ్లోక భావం. నిజానికి ఇక్కడ స్త్రీ పురుష విభజన అనవసరం. ఎవరి మనసునూ అర్ధం చేసుకోవడం సాధ్యం కాదు. అసలు మన మనసు మనకే అర్ధం కాదు. కనుక పైన చెప్పిన జటిల విషయాల కంటే కూడా మనసును అర్ధం చేసుకోవడం అసంభవం అని అర్థం చేసుకోవాలి.
golden words of Sanskrit Poets, talapatra shlokas, memorable Sanskrit Shlokas, Quotable shlokas in Sanskrit literature, Subhashitam and neethi satakam, Quotes in Sanskrit