వసంత పంచమి.. ఇదిగో ఈ నైవేద్యాలంటే సరస్వతి దేవికి ప్రీతి..!
వసంత పంచమి.. ఇదిగో ఈ నైవేద్యాలంటే సరస్వతి దేవికి ప్రీతి..!
జ్ఞానానికి అధిదేవతగా సరస్వతి దేవిని పేర్కొంటారు. చేతిలో వీణ పట్టుకుని హంస వాహనం పైన ఆసీనురాలై ఉండే సరస్వతీ దేవి అనుగ్రహం ఉంటేనే ఎవరికైనా విద్య అబ్బుతుంది. ఎవరికైనా చదువు ఒంటకపోతే సరస్వతి అనుగ్రహం లేదు అంటుంటారు. అయితే ఆ తల్లిని పూజిస్తే.. జ్ఞానాన్ని బిక్షగా పెట్టమని వేడుకుంటే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఫిబ్రవరి 2వ తేదీన వసంత పంచమి కానుంది. ఈ వసంత పంచమి రోజు సరస్వతి దేవి పూజలు ఎంతో ఘనంగా జరుపుతారు. ఈ రోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేస్తారు. దీని వల్ల పిల్లలకు ఆ తల్లి అనుగ్రహంతో మంచి విద్య లభిస్తుందని అంటారు. వసంత పంచమి రోజు సరస్వతి పూజ చేస్తే ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం సమర్పిస్తే ఆ తల్లి సంతోషిస్తుంది.
పరమాన్నం..
అమ్మవారికి బెల్లంతో చేసిన ప్రసాదాలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బెల్లంతో వండే పరమాన్నం అంటే ఎంతో ఇష్టం. వసంత పంచమి రోజు పరమాన్నం వండి అమ్మవారికి ప్రసాదం నివేదించాలి. ఆ తరువాత ఆ ప్రసాదాన్ని అందరూ తీసుకోవాలి. అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది.
కేసర్ శ్రీఖండ్..
శ్రీఖండ్ పెరుగుతో తయారు చేసే పదార్థం. చక్కర, కుంకుమ పువ్వు, యాలకులు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి తయారు చేసే శ్రీఖండ్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అయితే పెరుగు బాగా గట్టిగా, తాజాగా ఉండాలి.
పాయసం..
సరస్వతి దేవికి పాలు, పెరుగు, తేనె, పంచదార.. ఇవన్నీ చాలా ఇష్టం. పాలతో పాయసం చేసి చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టినా అమ్మవారు ప్రీతి చెందుతారు.
అరటిపండ్లు, ఎండుద్రాక్ష, చెరకు రసం మొదలైన పదార్థాలు ఉపయోగించి తయారు చేసే ప్రసాదాలు కూడా సరస్వతి దేవికి చాలా ఇష్టం. వీటిలో ఏదో ఒకటి అయినా సరస్వతి దేవికి నివేదించి పూజ చేస్తే అనుగ్రహిస్తుంది.
*రూపశ్రీ.