శ్రీ పంచమి రోజు పిల్లలతో ఇలా చేయిస్తే చాలు.. చదువులో రాణిస్తా
శ్రీ పంచమి రోజు పిల్లలతో ఇలా చేయిస్తే చాలు.. చదువులో రాణిస్తారు..!
శ్రీ పంచమి లేదా వసంత పంచమి మాఘమాసంలో పంచమి తిథిన వస్తుంది. ఈరోజు సరస్వతి దేవిని పూజించడం జరుగుతుంది. చదువుల తల్లి సరస్వతి కటాక్షం ఉంటే పిల్లలు చదువులో రాణిస్తారు. అందుకే చిన్నతనం నుండి పిల్లలకు సరస్వతి పూజ నేర్పించాలని చెబుతారు. అయితే బిజీ జీవితాలలో తల్లిదండ్రులకే సమయం ఉండదని వాపోతుంటారు. ఇక పిల్లల సంగతి సరే సరి.. ట్యూషన్లు, స్కూల్లు, స్పెషల్ క్లాసులు, కోచింగ్ లు అంటూ పరుగులు పెట్టిస్తుంటారు. కానీ ఇతర రోజులలో ఎలాగున్నా శ్రీ పంచమి రోజు పిల్లలతో కొన్ని పనులు చేయిస్తే వారికి ఆ సరస్వతి కటాక్షం లభిస్తుందని పురాణ పండితులు చెబుతున్నారు. ఇంతకూ శ్రీ పంచమి రోజు పిల్లలతో చేయించాల్సిన పనులేంటంటే..
సరస్వతి పూజ..
సాధారణ రోజులలో పిల్లలను రోజూ స్నానం చేయగానే దేవుడి గదిలో దేవుడి ముందు కూర్చోబెట్టి పూజ చేయించడం సహజంగా జరగదు. చాలా కొద్దిమంది మాత్రమే పిల్లలను దేవుడి గదిలో దేవుడి ముందు కూర్చోబెడుతుంటారు. అయితే కనీసం శ్రీపంచమి రోజు అయినా పిల్లలను ఉదయాన్నే నిద్రలేపి స్నానం చేయించి వారిని ఇంట్లో దేవుడి గదిలో కూర్చోబెట్టి సరస్వతి పూజ చేయించాలి. సరస్వతి పూజ మొత్తం చేయించలేక పోతే కనీసం దేవుడికి నమస్కారం చేయించి, సరస్వతి శ్లోకాలు చెప్పించాలి. ముఖ్యంగా సరస్వతి ద్వాదశ నామాలు ఉంటాయి. వీటిని పిల్లలతో చెప్పించాలి. ఇలా చేస్తే సరస్వతి కటాక్షం ఉంటుంది.
పిల్లలు పూజకు కూర్చోకపోతే..
కొందరు పిల్లలు చాలా మొండిగా ఉంటారు. దేవుడంటే భక్తి ఉండదు. దేవుడికి నమస్కారం చేసుకోమన్నా నిర్లక్ష్యంగా వెళ్లిపోతారు. అయితే ఈ తప్పు తల్లిదండ్రులదే.. పిల్లలకు మొదటి నుండే దేవుడి ముందు కూర్చోవడం, దేవుడికి నమస్కారం చేసుకోవడం, దేవుడి శ్లోకాలు పఠించడం వంటివి నేర్పించాలి. రోజూ ఉదయాన్నే స్నానం చేయగానే దేవుడి గదిలోకి వెళ్లి నమస్కారం చేసుకుని గణపతి శ్లోకం, సరస్వతి శ్లోకం చెప్పుకుని నుదుటన కాసింత కుంకుమ బొట్టు పెట్టుకోడం నేర్పితే పిల్లల జీవితం చాలా బాగుంటుంది. వారు చదువులో అద్బుతంగా రాణిస్తారు. కాబట్టి రోజూ పిల్లలకు దేవుడికి నమస్కరించడం నేర్పాలి.
గుడికి తీసుకెళ్లండి..
శ్రీ పంచమి రోజూ చాలా దేవాలయాలలో సరస్వతి పూజ నిర్వహిస్తారు. కుదిరితే ఆ రోజు పిల్లలకు గుడికి తీసుకెళ్లి అక్కడ సరస్వతి పూజ జరుగుతూ ఉంటుంది. ఆ పూజలో పిల్లలను కూర్చోబెట్టాలి. పిల్లలను తీసుకెళ్లడం వీలు కాకుంటే. పిల్లలకు స్కూలు పోతుందనే సమస్య ఉంటే పిల్లలను స్కూలుకు పంపాక కనీసం తల్లిదండ్రులలో ఎవరో ఒకరు అయినా ఆ పూజకు హాజరు కావడం మంచిది. అది కూడా కుదరకపోతే.. కనీసం పిల్లలు సాయంత్రం స్కూలు నుండి వచ్చిన తరువాత అయినా తల్లిదండ్రులు వీలు కుదుర్చుకుని పిల్లలను సాయంత్రం అయినా గుడికి తీసుకెళ్లి దేవుడికి నమస్కారం చేయించాలి.
శ్లోకాలు.. ద్వాదశ నామాలు..
పిల్లలకు గణపతి శ్లోకం, సరస్వతి శ్లోకం నేర్పించాలి. అలాగే సరస్వతి ద్వాదశ నామాలు ఉంటాయి. వీటిని కూడా పిల్లలకు నేర్పించాలి. ఇవి మరీ పెద్దగా ఉండవు కాబట్టి ఇవి పిల్లలకు తొందరగానే నోటెడ్ అయిపోతాయి. అనంత కేశవ నారాయణ అచ్యుత గోవిందా అనే నామాలు కూడా పిల్లలకు నేర్పిస్తే చాలామందికి. పిల్లలకు గుర్తు తెచ్చుకుని పక్కన వాళ్లు చెబుతుంటే చెప్పే స్థితి నుండి పిల్లలకు ఏదైనా మనసు ఇబ్బంది, భయం, పరీక్ష రాయాలనే దృఢ నిశ్చయం ఇలా ప్రతి విషయంలో పిల్లలకు ఈ శ్లోకాలు ఎనలేని శక్తిని ఇస్తాయి. అయితే కేవలం శ్లోకాలు చదివి జీవితంలో ఎదిగిపోతారని అనుకోకూడదు. ఆ అమ్మవారు అయినా, ఏ దేవుడు అయినా ప్రయత్నం చేయమని చెబుతాడు. ఆ తరువాతే తన సహాయం అందిస్తాడు. కాబట్టి పిల్లలకు క్రమశిక్షణ ఉండాలన్నా, వారు మంచి నడవడికలో సాగాలన్నా దైవం అనేది చాలా గొప్ప మార్గం అవుతుంది. కనీసం ఈ శ్రీ పంచమి నుండి అయినా పిల్లలకు ఇవన్నీ నేర్పించడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది.
*రూపశ్రీ.