Read more!

శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం

 

శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం

 

 

దీపమే లక్ష్మి ... చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం, అదే సంపద, జ్ఞానము, సంపద బిన్నమైనవి కావు. ఒకటి వుంటే రెండోది ఉన్నట్టే. ఇతరులను వంచిస్తే, అవినీతి మార్గాల్లో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే చాలనుకుంటారు చాలామంది. అలాంటివారిని లక్ష్మి వరించినట్టు కనిపించినా అది చంచలం . దయా, సేవాబావం, శ్రమ, వినయం, వివేకం ఉన్నచోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇదే అసలు రహస్యం. లక్ష్మీదేవి అష్టరూపాలలో కనిపిస్తుంది అవి ఆదిలక్ష్మీ, దైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి విద్యాలక్ష్మి, ధనలక్ష్మి దేవిలా ఉంటుందని మనకు తెలుసు. వీటిలో `విద్యాలక్ష్మి' అంటే, జ్ఞానం వివేకం వంటి సద్గుణ సంపద అని కుడా అర్ధం చేసుకోవాలి. అటువంటి లక్ష్మితత్వాన్ని అందరుసంపాదించాలి. మంచి మనసే లక్ష్మిదేవికి ఖచ్చితమైన సేఫ్టీ లాకరుగా చెప్పవచ్చు.

 

 

లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా  అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే
"అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను. మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి - అంటూ లక్ష్మి ఎవరెవరి వద్ద ఉంటుందో, ఎవరివద్దవుండదో, వివరించాడు. లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలివి.

 

 

    భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.శ్రీ హరి కుడా ఉండదు.
    శంఖద్వని వినిపించని చోటా.
    తులసిని పూజించని చోట.
    శంఖరుని అర్చించని చోట.
    బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట.  లక్ష్మి దేవి నివసించదు.
    ఇల్లు కళ కళ లాడుతూ ఉండని  చోట.
    ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట.
    విష్ణువును ఆరాధించకుండా వున్న చోటు.
    ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.
    హృదయములో పవిత్రత లోపించిన, ఇతరులను హింసింస్తున్న, ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలోనుంచి వెళ్ళిపోతుంది.
    అనవసరం గా గడ్డిపరకలను తెంచిన.
    చెట్లను కులగొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది.

 

 

 

నిరాసావాధులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులుగా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు.

శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మి విరజిల్లుతుంది.
ఇలా శ్రీ హరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో, ఎలాకలగదో చెప్పారు. గర్వించినా, అహంకారము చూపినా  ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్ధము. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం.