Read more!

ఆరంభింపరు నీచ మానవులు

 

 

ఆరంభింపరు నీచ మానవులు

 

 

 

ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః

ప్రారభ్య విఘ్ననిహతా విరమంతి మధ్యాః ।

విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః

ప్రారబ్ధముత్తమ జనా న పరిత్యజంతి ॥
 

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై

యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్

ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై

ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్

అని మనం తరచూ ఓ తెలుగు పద్యాన్ని వింటూ ఉంటాము కదా! దానికి సంస్కృత మూలమే పైన కనిపించే పద్యం. దారిలో ఏమన్నా ఆటంకాలు ఎదురవుతాయేమో అన్న భయంతో అధములు అసలు పనినే మొదలుపెట్టరట. ఇక మధ్యములు పనిని మొదలుపెట్టినా... మధ్యలో ఏవన్నా అడ్డంకులు ఎదురైన వెంటనే పనిని వదిలిపెట్టేస్తారు. ఇక ధీరులు ఉన్నారే! వారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే... మొదలుపెట్టిన కార్యాన్ని అంతకంతకూ రెట్టింపు ఉత్సాహంతో పూర్తిచేసి తీరతారు.