Read more!

అలాంటివారు కొందరే ఉంటారు

 

 

అలాంటివారు కొందరే ఉంటారు

 

 

 

మనసి వచసి కాయే పుణ్య పీయూష పూర్ణాః

త్రిభువనముపకార శ్రేణిభిః ప్రీణయంతః ।

పరగుణ పరమాణూన్పర్వతీకృత్య నిత్యం

నిజహృది వికసంతః సంతి సంతః కియంతః ॥

మనసా, వాచా, కర్మణా... మంచి పనులు చేయాలనే తపన ఉన్నవారు; ముల్లోకవాసులనూ ఉపకారబుద్ధితో సంతోషపెట్టేవారు; పరులలో ఉన్న సద్గుణాలు అణువంతైనా ఉన్నప్పటికీ.... వాటిని కొండంతగా భావించి ఆనందించేవారు కొందరు మాత్రమే ఉంటారు.