ప్రతి అంగుళంలో భగవంతుడు వుంటాడు

 

ప్రతి అంగుళంలో భగవంతుడు వుంటాడు

 


భగవంతుడనే వాడు ఉన్నాడో లేడో ఉంటే ఎక్కడ ఉన్నాడు అంటూ సందేహాలను పెంచుకొని తన జీవితంలో కాంతిని రావడానికి వీలులేకుండా చేసుకొంటున్నారు కొందరు మనుషులు..ఇటువంటివి చేసిన వారికి జీవితపు విలువ ఏం తెలుస్తుంది. " నేను ఒక్కడే బాగుండాలి " అన్న పదాన్ని వదిలి నలుగురు మంచికోసం పాటుపడాలి. వెనువెంటనే ఆ భగవంతుడి యొక్క వెలుగు కిరణాలు మన మీద ప్రసరిస్తాయి . దానితో అరణ్యం అనే మన మనస్సు కాస్తా ఆనంద నందనవనం అవుతుంది. భగవంతుడు చిరునామ కోసం వెదకకుండా ఎదుటి మనిషిలో పరమాత్మనుచూసే దృష్టిని పెంచుకొంటే ప్రతి అంగుళంలో భగవంతుడు కనిపిస్తాడు. కనుక ప్రతిఒక్కరూ ఆరోజు కోసం శ్రమిద్దాం.

 

---- మీ అనిల్.