సావిత్రి విజయానికి గుర్తుగా ఈ వ్రతము

 

సావిత్రి విజయానికి గుర్తుగా ఈ వ్రతము


- రచన యం.వి.యస్.సుబ్రహ్మణ్యం




“వట సావిత్రి వ్రతము “

 



 ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడే “వట సావిత్రి వ్రతము “ ఆచరించాలని  వ్రత గ్రంధాలూ పేర్కొన్నాయి. కానీ నేటి కాలంలో  “ ఏరువాక పున్నమి” వెళ్ళిన 13 వ రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. తన భర్త సత్యవంతుడు చనిపోయినపుడు, సావిత్రి పవిత్రమైన వటవృక్షాన్ని ( మర్రి వృక్షాన్ని) పూజించి, యమధర్మ రాజు నుంచి, తన భర్త ప్రాణాలనుతిరిగి వెనక్కి తెచ్చుకున్నాడని పురాణ కధనం. అందుకే, సావిత్రి పతిభక్తి విజయానికి గుర్తుగా ఈ వ్రతాన్ని ఆచరించడం ఆచారమయింది.


ఈ ‘ ఏరువాక పున్నమి’   నాడు వివాహిత మహిళలంతా కొత్త దుస్తులు ధరించి, ఏటి ఒడ్డున ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి, ఎర్రని సింధూరంతో ఆ మర్రి చెట్టును అలంకరించి, రంగురంగుల పుష్పాలతో పూజించి నూలు దారం పోగులను చెట్టు మొదలు చుట్టూ చుట్టి, ఏడు ప్రదక్షిణలు చేస్తూ,  తమ భర్తలు , సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్మంతులు  కావాలిని. ప్రార్ధిస్తారు. ఆ రోజంతా ఉపవాసం చేస్తారు. ఇలా వ్రతం చేయడం వల్ల తమ మాంగల్య సౌభాగ్యం పది కాలాలు చల్లగా, పచ్చగా, ఉంటుందని స్త్రీలందరి నమ్మకం.