పెళ్లిలో ఎదుర్కోలు సమయం

 

పెళ్లంటేనే సందడి. చుట్టాలు, పక్కాలు.. హితులు, స్నేహితులు, సన్నిహితులు.. ఇలా ఓ సమూహం. ఓ సమూహం.. పరిచయమే లేని మరో సమూహంతో మమేకమైపోయే అద్భుత సంరంభం పెళ్లి. ఓ జంటను కలపడానికి కొన్ని వందల మంది కలిసిపోవడం అద్భుతం కాక మరేంటి చెప్పండి? పెళ్లి అనగానే... కేవలం అబ్బాయి ఇంటివాళ్లు, అమ్మాయి ఇంటివాళ్లు మాత్రమే కలవరండి. అబ్బాయిల బంధువులు... అమ్మాయిల బంధువులు కూడా కలుస్తారు. రక్త సంబంధీకులు మాత్రమే కాదు... ఇవి కూడా దేవుడు కలిపిన బంధాలే. ఆ బంధాలు కలవడానికి ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని మన పూర్వీకులు మనకు అందించారు. అదే ‘ఎదుర్కోలు’. అసలు ఈ పదానికి అర్థమేంటి?  తెలుసుకుంటే.. నిజంగా మనసు పులకరిస్తుంది. ఒక్కసారి చూడండి.. తెలుసుకోండి.