విద్య ఉంటే ఏంటి ఉపయోగం!
విద్య ఉంటే ఏంటి ఉపయోగం!
విద్యచే భూషితుండయి వెలయుచున్న
తొడరి వర్జింపనగు నుమీ దుర్జనుండు
చారుమాణిక్యభూషిత శస్తమస్త
కంబైన పన్నగము భయంకరముగాదె.
పాము నెత్తిన మణి ఉంది కదా అని దాని జోలికి పోము కదా! పాము పామే కదా అని మన జాగ్రత్తలో మనం ఉంటాము. దుర్జనుడు కూడా అంతే! ఎంత విద్యను ఆర్జించినా, వక్రమైన బుద్ధి ఉన్నవారికి దూరంగా ఉండాల్సిందే!