పురాణాల్లో భూమి పరిమాణం Earth length
పురాణాల్లో భూమి పరిమాణం
Earth length
పురాణాలను అనుసరించి భూమి పరిమాణం 50 కోట్ల యోజనాలు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ కాలంలో శాస్త్ర అంశాలు కూలంకషంగా అర్ధమౌతున్నాయి. ప్రతిదీ సశాస్త్రీయంగా బోధపడుతోంది. కానీ ఎలాంటి సాంకేతిక విజ్ఞానమూ లేని కాలంలోనే మన మహర్షులు భూమి, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలకు సంబంధించిన అనేక అంశాలను ఎంతో చక్కగా అంచనా వేసి స్పష్టంగా చెప్పారు.
మన మహర్షులు తమ దివ్య దృష్టితో చూసి భూమికి సంబంధించిన అంశాలను అంచనా వేశారు. ఆ లెక్క ప్రకారం భూ పరిమాణం 50 కోట్ల యోజనాలు. ఈ వివరాలు పూరాణాల్లో లిఖితమై ఉన్నాయి. భూమి పరిమాణం అంటే ఘనఫలం అని అర్ధం చేసుకోవాలి.
ఈనాటి శాస్త్రవేత్తలు భూవ్యాసం 8 వేల మైళ్ళు అని తేల్చారు. మన మహర్షులు చెప్పిన లెక్కకు ఈనాటి శాస్త్రవేత్తలు చెప్పిన లెక్క సరిపోతుంది. ఒక యోజనం అంటే ఎనిమిది మైళ్ళు. అలా ఎనిమిది వేల మైళ్ళు వెయ్యి యోజనాలు.
ఇప్పుడు ఘనఫలాన్ని కింది విధంగా చూడాలి.
4 / 3 X 22 / 7 X 500 X 500
అప్పుడు 50 కోట్లు అవుతుంది.
Earth's equator 8 thousand miles, the earth's circumference, north pole to south pole of the earth, earth calculations in Puranas