సంకష్ట చతుర్థి రోజు ఈ పనులు చేస్తే ఐశ్వర్యం సిద్దిస్తుంది..!
సంకష్ట చతుర్థి రోజు ఈ పనులు చేస్తే ఐశ్వర్యం సిద్దిస్తుంది..!
వినాయకుడికి చవితి తిథికి చాలా గొప్ప సంబంధం ఉంటుంది. వినాయకుడు చవితి రోజు జన్మించడం వల్ల చవితి తిథికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ప్రతి నెల పౌర్ణమి తరువాత వచ్చే చవితి రోజును సంకష్ట చతుర్థి అంటారు. సంకష్ట చతుర్థి లేదా సంకటహర చతుర్థి వినాయకుడిని పూజించే రోజు. జీవితంలో ఏర్పడే సమస్యలు, బాధలు, కష్టాలు సంకష్ట చతుర్థి రోజు చేసే చర్యల వల్ల దూరం అవుతాయని, తలపెట్టే కార్యాలలో విఘ్నాలు తొలగుతాయని అంటారు. సంకష్ట చతుర్థి రోజున ఏ పనులు చేయాలో తెలుసుకుంటే..
నవంబర్ నెలలో సంకష్ట చతుర్థి నవంబర్ 18 వ తేదీ వచ్చింది. ఈ రోజు వినాయకుడి కోసం ఉపవాసం ఉండవచ్చు. సంకష్ట చతుర్థి పూజ చేసేవారు తప్పకుండా ఉపవాసం ఉండాలి. దీని వల్ల సుఖ శాంతులు చేకూరతాయి. సంకష్ట చతుర్థి 18 వ తేదీ సోమవారం సాయంత్రం 6.56 నిమిషాల నుండి నవంబర్ 19 సాయంత్రం 5.28 వరకు ఉంటుంది.
ఆర్థిక సంబంధ సమస్యలు తొలగాలన్నా, ఐశ్వర్యం సిద్దించాలన్నా సంకష్ట చతుర్థి రోజు వినాయకుడికి దుర్వాపత్రం లేదా గరిక సమర్పించాలి. ఇలా చేస్తే జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. సంపదలు చేకూరతాయి.
వినాయకుడికి మోదకాలు అంటే చాలా ప్రీతి. అందుకే సంకట చతుర్థి సమయంలో వినాయకుడికి మోదకాలు సమర్పించాలి. దీని వల్ల వినాయకుడు సంతోషిస్తాడు. మోదకాలు నైవేద్యంగా పెట్టినవారు జ్ఞానాన్ని పొందుతారని అంటున్నారు.
సంకష్ట చతుర్థి రోజు శ్రీ గణాదిపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ వినాయకుడికి 5 పసుపు ముద్జలు సమర్పించాలి. ఇది కుటుంబంలో ఆనందాన్ని శ్రేయస్సును తెచ్చి పెడుతుంది.
డబ్బు కొరత ఎదుర్కొంటున్నవారు సంకష్టి చతుర్థి రోజు పై పనులు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగుతాయి. తలపెట్టే పనులలో ఆటంకాలు తొలగుతాయి. డబ్బుకు కొరత లేకుండా చేస్తుంది. జీవితంలో అభివృద్ది ఉంటుంది. సంకష్ట గణపతికి సంబంధించిన శ్లోకాలు, మంత్రాలు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ పనిని నమ్మకంగా చేయాలి. అప్పుడు గొప్ప ఫలితం ఉంటుంది.
*రూపశ్రీ.