చదువుల తల్లి జన్మదినమే వసంతపంచమి

 

 

వసంతపంచమి....దీనినే మాఘశుద్ధపంచమి అని...శ్రీ పంచమి అని కూడా అంటారు.
ఈరోజు సరస్వతీదేవి పుట్టిన రోజు. సరస్వతీ దేవి మూల నక్షత్రంలో జన్మించారు.
అందుకే వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని పూజిస్తే....జానవంతులవుతారని, అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం....

అందుకే పోతన గారు... తల్లీ  నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవునా యుల్లంబందున నిల్చి జ్రుంభణముగా సూక్తుల్ సుశబ్దంబుశో భిల్లన్ బల్కుము నాదు వాక్కునను సంప్రతిన్ జగన్మోహినీ
పుల్లాభాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా....అన్నారు.

అందుకే ఈరోజు  పిల్లల విద్యాభ్యాసానికి ప్రారంభమైన అక్షరాభ్యాసం చేస్తే చాలా బాగుంటుందని చేస్తారు.
అందుకే అందరం సరస్వతీ పూజ చేసుకుంటే ఆమె దీవెనలు మనకెంతగానో ఉపయోగపడతాయి....
అందుకే అమ్మని ఒకసారి తలుచుకుంటే చాలు...మన మనసు ఎంతో పులకరించేస్తుంది....
అమ్మకి ఉన్న సహస్రనామాలలో అత్యున్నతమైన ద్వాదశ నామాలు ఒక్కసారి  తెలుసుకుందాం.....

1. భారతి          2. సరస్వతి             3. శారద
4.హంసవాహిని  5. జగతీఖ్యాత         6. వాగీశ్వర
7. కౌమారి        8. బ్రహ్మచారిణి        9.బుద్ధి ధాత్రి
10. వరదాయిని   11. క్షుద్ర ఘంట    12. భువనేశ్వరి
చదువుల తల్లి ద్వాదశ నామాలు తెలుసుకున్నారు కద..

ఇక పూజా విధానం తెలుసుకుందామా...?     
 
వసంత పంచమి రోజున ప్రాత: కాలంలో నిద్రలేచి స్నానం ఆచరించి....తెల్లని వస్త్రాలను ధరించి..గంధము ధరించి.. ముందుగా ఒక ప్రదేశం బాగా శుభ్రం చేసి...అక్కడ పద్మము, శంఖము, చక్రము వేసి...పీట మీద సరస్వతీ దేవి ప్రతిమను కానీ ఫొటోని కానీ ఉంచి...ముందుగా గణపతి పూజ చేసి తర్వాత అమ్మవారి ఫొటో ముందు మినప పిండితో చేసిన ప్రమిదలో నెయ్యి వేసి...వత్తి పెట్టి...దీపం వెలిగించి...కొత్త పుస్తకాలను పెన్నును అక్కడ ఉంచి ఆరాధించాలి. తల్లిని తెల్లని కమలాలతో లేదా ఏవైనా తెల్లని  పుష్పాలతో అర్చించాలి. మాల వేయాలి తర్వాత సుగంధ ద్రవ్యాలను రంగరించిన గంధమును సమర్పించాలి.

అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు...ఏమిటంటే...
నూకలు లేకుండా అన్నంతో చేసిన క్షీరాన్నం.....          
తెల్లని నువ్వులతో చేసిన ఉండలు....ఆవుపాలు...
ఆవు పెరుగు...ఆవు నెయ్యి...ఆవు వెన్న....
ఇలా ఇందులో ఏదైనా మీశక్తి కొలది అమ్మవారికి
నైవేద్యం సమర్పించాలి.
మీకు శక్తి ఉంటే తెల్లని వస్త్రాలను సమర్పించి
ఈ క్రింది మంత్రాలలో కనీసం....
ఏదో ఒకదాన్ని....21 మార్లు చదువుకొని...
అమ్మవారికి హారతి ఇవ్వాలి.....
ముందు వినండి...తర్వాత...
పఠనం చేసి...ఉచ్ఛారణం...చేసుకోండి.....
మొదటిది....
                సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి....
                విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా.....
రెండవది.....
                ఓం వాగ్దేవ్యైచ విద్మహే....బ్రహ్మపత్న్యైచ
                ధీమహీ...తన్నో వాణీ ప్రచోదయాత్............
మూడవది.........
                     ఓం సరస్వత్యైనమ:

ఈ విధంగా మీద చెప్పిన వాటిలోమీకు ఏది వీలైతే అది
21 సార్లు చదువుకొని అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఇలా
చేస్తే చేసిన వారందరికీ తప్పనిసరిగా చదువుల తల్లి సరస్వతి
దీవెనలు ఉంటాయి. దీని తో పాటు మీకు మరో ముఖ్యమైన
విషయం చెప్పాలనుకుంటున్నాం. పరీక్షలు దగ్గర పడుతున్న
తరుణంలో విద్యార్ధులు చదువుపట్ల టెన్షన్ పడుతూ ఉంటారు.

వీళ్ళు ఎలా చదువుతారో అని పెద్దలు కంగారు పడతారు.
కనక ఇటు పిల్లలు అటు పెద్దలు కూడా ప్రశాంతంగా ఉండి
విద్యాభ్యాసం చేయాలని కోరుకుంటూ మాదో చిన్న విన్నపం.
ఇప్పుడు ఎక్కడ చూసినా సెల్ ఫోన్ లు...రింగుటోన్ లు....
హడావిడిలో పడిన విద్యార్ధినీ విద్యార్దులందరూ కూడా తమ
సెల్ ఫోన్ రింగుటోన్ సరస్వతీ దేవిని ప్రార్థిస్తూ...ఉన్నది
పెట్టుకుంటే...అది మీకు ఎంతగానో ఉపకరిస్తుంది....ఎందుకంటే..
అమ్మని తలుచుకోగానే మన ద్రుష్టి చదువు మీద కెళ్తుంది...
చదువు మనకి వినయాన్ని...వినయము  మంచిపాత్రని
పాత్ర  మంచి ధనముని...ధనము ధర్మాన్ని...ధర్మం సుఖాన్ని
ఇస్తుంది అన్నారు....ఇదే పెద్దలు చెప్పింది ఏమిటంటే...
        విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతామ్   
        పాత్రుత్వాత్ ధనమాప్నోతి...ధనాత్ ధర్మం తతస్సుఖమ్...
అన్నారు. అందుకే విద్యార్ధినీ విద్యార్దులందరూ కూడా.... వసంత
పంచమి నాడు సరస్వతీ దేవి పూజ చేసుకొని...ఈనాటి నుంచి
కంటిన్యూగా మీ రింగుటోన్ గా....
సరస్వతీ దేవిని స్మరిస్తూ...
 సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా... అని
మరొకటి....హయగ్రీవ స్వామిని తలుచుకుంటూ..
జానానందమయం దేవం నిర్మలస్ఫటికాక్రుతిమ్
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే....అని
తలుచుకుంటూ మీ రింగుటోన్ గా పెట్టుకుంటే మీకు
వారి దీవెనలతో తప్పని సరిగా విజయం వస్తుంది...అని
తెలియజేస్తూ...మరొక్కసారి....
                చదువుల తల్లి సరస్వతి దీవెన....
విద్యార్ధినీ విద్యార్ధులందరికీ మేము చెప్పిన రింగుటోన్ తో
వస్తుందని...ఆశిస్తూ.....ఇక్కడితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.


   ......................శుభం..........................

- కుల శేఖర్