బంగారం కాదు.. వెండి ధరిస్తే ఇంత అదృష్టమని మీకు తెలుసా..

 

బంగారం కాదు.. వెండి ధరిస్తే ఇంత అదృష్టమని మీకు తెలుసా..


భారతీయులకు బంగారమంటే చాలా క్రేజ్. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బంగారం కొనాల్సిందే అంటారు. ప్రతి శుభకార్యానికి బంగారాన్ని సింగారించుకుంటారు.  సాధారణంగానే ఇంట్లో ఉండటానికే బంగారు గొలుసు, చెవి దుద్దులు,  ముక్కు పుడక,  వేళ్లకి ఉంగరాలు తప్పనిసరిగా పెట్టుకుంటూ ఉంటారు. అయితే బంగారం గురించి ఇంత క్రేజ్  ఉన్నవారికి వెండి గురించి అంత పట్టింపు ఉండదు. మహా అయితే కాళ్లకు పట్టీలు మినహా వెండి గురించి ఆలోచించడం తక్కువే. కానీ జ్యోతిష్య ప్రకారం   బంగారం కంటే  వెండి ధరించడమే అదృష్టమని,  ఇది చాలా లక్ ను తెచ్చి పెడుతుందని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..

వెండి ఆభరణాలు ధరించడం లేదా వెండి వస్తువులను ఉపయోగించడం వల్ల  జాతకంలోని గ్రహాలపై ప్రభావం చూపుతుందట.  ఇది  జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

వెండి శివుని కళ్ళ నుండి ఉద్భవించిందని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, వెండి చంద్రునితో ముడిపడిన లోహం. దీనిని ధరించడం వల్ల శరీరంలోని నీటి మూలకం,  కఫం నియంత్రించబడతాయట.

గ్రహాల విషయానికొస్తే వెండి ధరించడం వల్ల మనస్సు బలపడుతుందట.  మెదడు పదునెక్కుతుందట. ఇది చంద్ర దోషాలకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుందని,  శుక్ర గ్రహాన్ని బలపరుస్తుందని చెబుతున్నారు.  

ఆరోగ్య ప్రయోజనాల విషయానికొస్తే వెండి శరీరం నుండి విషాన్ని బయటకు పంపి, చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుందట. వెండి ఉంగరం ధరించడం వల్ల నొప్పి, దృఢత్వం,  వాపు వంటి ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించవచ్చని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి.

వెండి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వెండికి అనేక జ్యోతిష,  ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శుభప్రదమైన,  ఆరోగ్యకరమైన లోహంగా పరిగణించబడుతుంది. అందుకే వెండిని లైట్ తీసుకోకండి.

                                    *రూపశ్రీ.