దేవికి గంధ, వస్త్ర కంచుకాభరణాలు

 

శ్రీగంధం చందనోన్మిశ్రం - కుంకుమాగరు సంయుతం కర్పూరేణచ సంయుక్తం - విలేపనం సురేశ్వరీ "ఓం భూర్భువస్సువః భగవత్యై శ్రీ గాయత్రీదేవ్యై నమః చందనం సమర్పయామి" - అంటూ కుడిచేతి మధ్యమ అంగుళితో రవ్వంత గంధం అమ్మవారిపై చిలకరించాలి.

దుకూలం స్వీకురుష్వేదం స్వర్ణబిందు సమాయుతం ఉత్తరీయం కంచుకంచ తదావిధ మతంద్రితే "ఓం భూర్భువస్సువః భగవత్యై శ్రీ గాయత్రీదేవ్యై నమః కంచుక సహిత వస్త్రం సమర్పయామి" - అంటూ వస్త్రాలు సమర్పించాలి. అలా సమర్పించుకోలేని పక్షంలో "తదభావేన అక్షతాన్ సమర్పయామి" అంటూ కొన్ని అక్షతలు భక్తితో అమ్మవారి పాదాల వద్ద ఉంచాలి.

కేయూరైః కంకణైర్దివ్యై హారనూపురమేఖలా విభూషణా న్యమూల్యాని గృహాణ పరమేశ్వరీ "ఓం భూర్భువస్సువః భగవత్యై శ్రీ గాయత్రీ దేవ్యై నమః సంభావితాన్ సర్వాభరణాని సమర్పయామి" అంటూ అక్షతలు, నీళ్ళు జల్లాలి.