Controversy on Shirdi Sai baba's Padukalu on Tirumala Hills
సాయి పాదుకలతో అపవిత్రమైన తిరుమల...?!
Controversy on
Shirdi Sai baba's Padukalu on Tirumala Hills
తిరుమల వేంకటేశ్వరుని భక్తులకు, షిర్డీ సాయిబాబా భక్తులకు మధ్య వివాదం చెలరేగింది. అసలు సంగతి ఏమంటే షిర్డీ నుంచి సాయి బాలాజీ ట్రస్టు సభ్యులు సాయిబాబా పాదుకలను తిరుమలేశుని దర్శనానికై తెచ్చారు. పల్లకిలో ఒకవైపు సాయిబాబా చిత్రాన్ని, మరోవైపు వేంకటేశ్వర స్వామి చిత్రాన్ని మధ్యలో సాయిబాబా పాదుకలను ఉంచి అలిపిరి నుంచి తిరుమల కొండ మీదికి ఊరేగింపుగా తీసికెళ్ళారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు ఎదురెళ్ళి స్వాగతం పలికి సాయిబాబా పాదుకలను స్వామివారి సన్నిధికి తీసికెళ్ళి దర్శనం చేయించారు.
''షిర్డీ సాయిబాబా కేవలం గురువు మాత్రమేనని, అవతార పురుషుడో, దేవుడో కాడని, ఆయన పాదుకలను వేంకటేశ్వరుని సన్నిధికి తీసికెళ్ళడం అపచారమని, అసలు తిరుమల కొండమీదికి వేరొక దేవుని పటాన్ని లేదా విగ్రహాన్ని తేవడమే నిషిద్ధమని, అలాంటిది పాదుకలు తేవడం సబబు కాదని'' వెంకన్న భక్తులు మండిపడుతున్నారు. ''ఇది అపచారమని, సాయి పాదుకలతో అపవిత్రమైన తిరుమల ఆలయాన్ని వెంటనే శుద్ధి చేయాలని'' డిమాండ్ చేస్తున్నారు.
షిర్డీ సాయి బాలాజీ ట్రస్టు సభ్యులు ''ఇది ప్రతి సంవత్సరం జరిపే ఆచారమే.. ఎందుకు తప్పు పడుతున్నారు?'' అని ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయమై విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానంద, స్వయంగా దర్శనం చేయించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజును తప్పుపట్టారు. చినజీయర్ స్వామి తన అభిప్రాయం చెప్పకుండా, పెద్ద జీయర్ స్వామివారిని అడగమంటూ తప్పించుకున్నారు. ఇక ఇతర అధికారులు, భక్తులు కొందరు ''సాయిబాబా కూడా దైవాంశ సంభూతుడేనని, బాబా పాదుకలను కొండమీదికి తీసికెళ్ళడంలో తప్పు లేదని'', మరికొందరు ''కాదు అపచారం.. ఇవాళ సాయిబాబా పాదుకలను ఆమోదిస్తే, రేపు ఏ పీఠాధిపతో, మరెవరో సాధుపురుషుడో చనిపోతే వారి పాదుకలను తీసుకొస్తారు. ఇప్పుడే దీన్ని గట్టిగా ఖండించాలి'' - అంటూ ఎవరికి వారు తమ వాదాలను వినిపిస్తున్నారు.
తిరుమలలో ఈ అంశం పెద్ద వివాదంగా మారింది.
Controversy in Tirumala on Sai baba's Padukalu, Controversy Sai baba's Padukalu, Sai baba's padukalu not allowed on tirumala hills, lord venkateswara's devotees and sai baba devotees, shirdi sai balaji trust on tirumala hills, shirdi padukalu controversy in tirumala