Chinna Jeeyar Swamy Tirumala Yatra

 

చిన్న జీయర్ ది యాత్రా, దండయాత్రా?!

Chinna Jeeyar Swamy Tirumala Yatra

 

Click here for the VIDEO

 

''తిరుపతికి వెళ్తే ఒక క్లబ్బుకు వెళ్ళినట్లుగా ఉంటుంది'' - అంటూ సంచలనాత్మక వ్యాఖ్య చేసిన చిన్న జీయర్ స్వామి ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమయ్యారు. జీయర్ లక్షమంది అనుచరులతో కలిసి తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి ప్రయాణం కాబోతున్నారు.

 

అతి ప్రశాంతంగానే కొరడా ఝళిపించినట్లు, వాతలు పెట్టినట్లు చిన్న జీయరు చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆకర్షించాయి. కేవలం దర్శనంకోసమే అయితే ఇంత హంగామా అవసరమా? మరి ఏం సాధించదలచి, ఏ లక్ష్యాలను చేరదలచి ఆయన లక్షమందితో కలిసి తిరుమల యాత్ర చేస్తున్నట్లు?!

 

అశేష ప్రజానీకం మహా పుణ్యక్షేత్రంగా భావించే తిరుమలలో అల్లర్లు, అలజడులు సృష్టించాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు చిన జీయర్ ఏ సంచలనం సృష్టించాలనుకుంటున్నారు. పీఠాధిపతులు, భక్తులు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా విమర్శించారు. అటు చినజీయరు, ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బాపిరాజు - ఇద్దరిదీ తప్పేనని, ఆధ్యాత్మిక కేంద్రాన్ని అలజడులకు కేంద్రంగా మార్చకూడదని దుయ్యబడుతున్నారు. కాగా చిన్న జీయరు అనుచరులు తాము కేవలం యాత్రకు వెళ్తున్నామని, దాన్ని ''దండయాత్ర''గా భావించడం సరికాదని అంటున్నారు. ఇంతకీ చిన్న జీయర్ ది కేవలం యాత్రేనా లేక దండయాత్రా?!

 

Chinna Jeeyar sensational comment, chinna jeeyar going to tirumala, chinna jeeyar and 1 lakh followers, chinna jeeyar says tirumala like club, Chinna Jeeyar yatra to tirumala Video