Yellow Colour Therapy

 

పసుపురంగుతో చికిత్స

Yellow Colour Therapy

 

ఎరుపు, నీల వర్ణాలు సమపాళ్ళలో కలిస్తే పసుపు వర్ణం ఏర్పడుతుంది. పసుపు వర్ణం వేడి తత్వం ఉన్న శరీరాలను ఉద్దీపింపచేస్తుంది. పసుపురంగు తేజస్సుకు సంకేతం. పసుపురంగును ఇష్టపడేవారు ఉత్సాహంగా ఉంటారు. పసుపురంగు ఎక్కువగా ధరించేవారు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. పసుపురంగులో గొప్ప కళ ఉంది. అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. ఉంది. దాంతో పసుపు బట్టలు వేసుకున్నవారిపట్ల ఎదుటివారికి ఒకవిధమైన సద్భావం కలుగుతుంది. పసుపు రంగు నరాలను ఉత్తేజపరుస్తుంది.

 

పసుపు తేజశ్చక్రం కలవారు విజ్ఞానవంతులుగా ఉంటారు. వివేకంతో ప్రవర్తిస్తారు. ఆశావాదులై ఉంటారు.

పసుపురంగుకు పంచభూతాలు, నవగ్రహాలను అనుకూలంగా మార్చే శక్తి ఉంది.

పసుపురంగు ఎక్కువగా ఉపయోగించేవారు విశాల దృక్పథంతో ఉంటారు. ఈ వర్ణం మేధస్సుకు సంకేతం అని చెప్పాలి.

పసుపువర్ణం ఎక్కువగా ఉన్నవారిలో హాస్యప్రవృత్తి ద్యోతకమౌతుంది.

ఈ రంగును ఇష్టపడేవారు ఆత్మస్థైర్యంతో ఉంటారు, తెలివిగా వ్యవహరిస్తారు. లాజికల్ గా మాట్లాడతారు.

 

శతాబ్దాల తరబడి పసుపు రంగును శుభసూచకమైన వర్ణంగా భావిస్తున్నారు. గురువులు, స్వాములు కాషాయంతో బాటు పసుపు రంగును కూడా శుభప్రదంగా భావిచి ఎక్కువగా ఉపయోగిస్తారు. పెళ్ళిళ్ళు, వ్రతాల్లో పసుపు రంగు దుస్తులను ధరించడం తెలిసిందే. పసుపు రంగు ధరించినవారిని చూడగానే ఒక పవిత్రత గోచరిస్తుంది. శోభాయమానంగానూ ఉంటుంది.

 

పూర్వం విద్యార్థులు గురుకులానికి వెళ్ళి చదువుకునేవారు. అక్కడ అనేకమంది కలిసి ఉంటారు కనుక ఎవరికైనా వ్యాధులు ఉంటే, ఇతరులకు సోకే ఇబ్బంది ఉందని, పీత వస్త్ర ధారణ చేసేవారు. అలా విద్యాభ్యాసం చేసేంతకాలం పీత వస్త్రాలు మాత్రమే ధరించేవారు.

 

పసుపు రంగుతో అనేక వ్యాధులు తగ్గుతాయి. అజీర్ణం, పైత్యం లాంటి సమస్యలు నివారణ అవుతాయి. కుష్టు లాంటి దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేస్తుంది. మందగించిన జీర్ణావయవాలను, జీర్ణశక్తిని పునరుద్ధరిస్తుంది.

 

పసుపు రంగు దుస్తులు ధరించడంవల్ల శరీర వర్చస్సు పెరుగుతుంది. తలంబ్రాలు పచ్చగా ఉంటాయి. వధూవరులు తలంబ్రాలు పోసుకునే సమయంలో పసుపు అద్దిన వస్త్రాలను ధరిస్తారు.

 

క్రిమి సంహారిణిగా పనిచేసే పసుపును వంటలోనే కాకుండా ఇతరత్రానూ ఏదో విధంగా ఉపయోగిస్తుంటాం. గడపకు పసుపు రాయడంలో కేవలం సౌందర్య దృష్టి మాత్రమే లేదు. సూక్ష్మ క్రిములను ఇంట్లోకి చేరకుండా చేస్తుంది అనేది ప్రధాన ఉద్దేశం. పండుగ సమయాల్లో పిండివంటలు ఎక్కువగా చేసుకుంటాం కనుక, ఆ రోజుల్లో తప్పకుండా గడపకు పసుపు రాయడం అనేది ఆచారంగా మారింది. కూర, చారుల్లో పసుపు వేయడంవల్ల ఆకర్షణీయమైన రంగు రావడమే కాకుండా ఆరోగ్యానికీ మంచిది. కొందరు ముఖానికి, వంటికి పసుపు రాసుకుంటారు. ఇంకొందరు స్నానం చేసే నీటిలో పసుపు వేసుకుంటారు. ఇది చర్మ వ్యాధులను, ఇంకా అనేక రుగ్మతలను తగ్గిస్తుంది.

 

ఏ రకంగా చూసినా పసుపు, పసుపు వర్ణం కూడా చాలా మేలు చేస్తాయి.


colour therapy and yellow colour, yellow color therapy solar plexus chakra, devine color yellow and healthy turmeric, yellow color brings brightness, Yellow Color is the symbol of intellect