రంగజేబు సనాతన శక్తికి తలొగ్గి స్వయంగా గొప్ప ఆలయాన్ని నిర్మించాడని తెలుసా...
రంగజేబు సనాతన శక్తికి తలొగ్గి స్వయంగా గొప్ప ఆలయాన్ని నిర్మించాడని తెలుసా...
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు.. చావా సినిమా తరువాత ఔరంగజేబు గురించి భారత్ యాపత్తు గుర్రుగానే ఉందని చెప్పవచ్చు. ఔరంగజేబు తన కాలంలో+ అనేక హిందూ దేవాలయాలను కూల్చివేసాడు. అతని సైన్యం ఎక్కడికి వెళ్ళినా, అక్కడ దేవాలయాల స్థానంలో మసీదులు నిర్మించబడ్డాయి. ఇది చాలా సంవత్సరాలు కొనసాగింది. కానీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు జీవితంలో ఒక సమయం వచ్చింది. అతను సనాతన శక్తికి తలొగ్గిన సందర్భం ఉంది. కేవలం సనాతన శక్తికి తలొగ్గడమే కాదు.. అతను మనసు మార్చుకుని ఆలయాన్ని కూల్చివేసే బదులు, స్వయంగా ఆలయ నిర్మాణం చేయించాడు. ఇందుకోసం కోట్ల రూపాయల విలువైన భూమిని విరాళంగా ఇచ్చాడు. దేవాలయానికి డబ్బును వెచ్చించాడు. ఔరంగజేబు ఆలయాన్ని ఎప్పుడు, ఎందుకు నిర్మించాడో చాలా మందికి తెలియదు. ఆసక్తికరమైన ఈ విషయం గురించి తెలుసుకుంటే..
చిత్రకూట బాలాజీ ఆలయం..
ఇది 1683, 1686 మధ్య కాలంలో జరిగింది. మొఘల్ పాలకుడు ఔరంగజేబు తన సైన్యంతో ముందుకు సాగుతున్న సమయంలో చిత్రకూట వద్ద ఆగాడు. అక్కడి ఆలయాన్ని కూల్చివేసేందుకు రాజు తన సైన్యాన్ని ఆదేశించాడు. కానీ అదే సమయంలో అతని సైనికులకు అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. రాజ అధికారులు కూడా ఈ నొప్పికి చికిత్స చేయలేకపోయారు. అప్పుడు దగ్గరలో నివసించే బాలక్‌దాస్ అనే ఋషి దగ్గర దానికి మందు ఉందని ఔరంగజేబు తెలుసుకున్నాడు.
ఔరంగజేబు తన సైన్యంతో కలిసి ఈ నొప్పికి చికిత్స కోసం సాధువు వద్దకు వెళ్లాడు. సాధువు వారందరికి చికిత్స చేశాడు. సాధువు చికిత్స చేసిన తరువాత రాజు, అతని మొత్తం సైన్యం నొప్పి నుండి ఉపశమనం పొందారని చెబుతారు. ఆ సాధువు శక్తికి ముగ్ధుడైన మొఘల్ చక్రవర్తి చిత్రకూట్‌లోని ఏ ఆలయాన్ని కూల్చివేయనని ఆ సాదువుకు చెప్పాడు. ఇది మాత్రమే కాదు రాజు చిత్రకూట్‌లోని రామ్‌ఘాట్ సమీపంలో మందాకినీ నది ఒడ్డున బాలాజీ ఆలయాన్ని కూడా నిర్మించాడు.
ఆలయ నిర్మాణంతో పాటు ఆలయ పూజారి మహంత్ బాలక్‌దాస్ పేరుతో ఒక ఆదేశ పత్రం కూడా జారీ చేశాడు. దీని కింద ఆలయ నిర్వహణ కోసం మొఘల్ పాలకుడి నుండి రాజ పోషణ లభించిందని, దాదాపు 330 బిఘాల భూమిని కూడా ఆలయానికి విరాళంగా ఇచ్చారని అందులో సారాంశం. ఈ శతాబ్దాల నాటి శాసనం ఇప్పటికీ ఆలయంలో భద్రపరచబడింది. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్‌లో ఉందట.
*రూపశ్రీ.