Read more!

అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి వీరు... 32 ఏళ్లుగా శ్రీరాముని ఆరాధన!

 

అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి వీరు... 32 ఏళ్లుగా శ్రీరాముని ఆరాధన!

జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు.వీటన్నింటిలోనూ ఆలయ ప్రధాన అర్చకుడిపై వాడివేడిగా చర్చ సాగుతోంది. 83 ఏళ్ల ఆచార్య సత్యేంద్ర దాస్ రామమందిర ప్రధాన పూజారిగా సేవలందిస్తున్నారు.సత్యేంద్ర దాస్ గత 32 సంవత్సరాలుగా రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్నారు. 1992లో బాబ్రీ విధ్వంసానికి ముందు సుమారు తొమ్మిది నెలల పాటు పూజారిగా రాముడిని పూజించారు.ఆచార్య సత్యేంద్ర దాస్ 1975లో సంస్కృత విద్యాలయం నుండి ఆచార్య డిగ్రీని పొందారు. దీని తర్వాత, 1976లో, అయోధ్యలోని సంస్కృత కళాశాలలో వ్యాకరణ విభాగంలో సహాయ ఉపాధ్యాయునిగా ఉద్యోగం పొందాడు.

1992లో రామజన్మభూమి ఆలయానికి ఆచార్య సత్యేంద్ర దాస్ నియమితులయ్యారు. ఆ రోజుల్లో సేవ, పూజలు చేస్తే నెలకు 100 రూపాయలు వచ్చేవి. నెలకు 100 రూపాయల జీతం పొందుతున్న ఆచార్య సత్యేంద్ర దాస్ కు  2018 లో 12 వేలు పెరిగింది. 2019లో ఈ వేతనాన్ని రూ.13 వేలకు పెంచారు.సత్యేంద్ర దాస్‌ వయసు ఇప్పుడు 80 ఏళ్లు. అయినప్పటికీ, రాముని ఆరాధన కోసం అతని స్థానంలో మరొక ప్రధాన పూజారిని ఎన్నుకోలేదు రామమందిరం ట్రస్టు.

కాగా 2024లో జనవరిలో అయోధ్య రామమందిరాన్ని పున ప్రారంభించేందుకు ఏర్పాట్లన్నీ జరుగుతన్నాయి. ఈ క్రమంలోనే రామమందిరంలో పూజారిగా ఓ యువ అర్చకుడిని కూడా ఎంపిక చేశారు. అయోధ్య రామమందిరం పూజారిగా యూపీలోని గజియాబాద్ కు చెందిన అర్చక విద్యార్థి మోహిత్ పాండేను సెలక్ట్ చేసింది రామమందిరం ట్రస్టు. దధేశ్వర వేది విద్యాపీఠ్ లో 7ఏళ్లుగా ఉండి శిక్షణ తీసుకున్న మోహిత్..తదుపరి చదువులు తిరుపతిలో పూర్తి చేశారు. అతి చిన్న వయస్సులో మోహిత్ పాండే ప్రతిష్టాత్మక అయోధ్య రామమందిరానికి పూజారిగా నియమితులయ్యారు. అయోధ్య రామమందిరంలో పూజారి పోస్టుకు మూడువేల మందిని ఇంటర్వ్యూ చేసింది ట్రస్టు. అందులో ఈ స్థానానికి ఎంపికైన 50మంది లో మోహిత్ పాండే కూడా ఒకరు. నియామకానికి ముందుగా 6నెలలపాటు మెహిత్ కు శిక్షణ కూడా ఇస్తారు.