Read more!

ఈ చంద్రగ్రహణం రోజు నాలుగు రాశుల వారికి మరణం..

 

ఈ చంద్రగ్రహణం రోజు నాలుగు రాశుల వారికి మరణం?

 


ఈ నెల 31న వస్తున్న పౌర్ణమి చాలా ప్రత్యేకం అని ఈపాటికే మీడియా అంతా ఊదరగొట్టేశారు. నెలలో రెండోసారి వస్తున్న పౌర్ణమి కాబట్టి దీన్ని బ్లూమూన్‌ అనీ, భూమికి అతి చేరువలో వస్తోంది సూపర్‌మూన్ అనీ పిలుస్తారు. ఇదే రోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతోంది. అయితే ఈ చంద్రగ్రహణం చాలా అశుభం అనీ... మేషం, కర్కాటకం వంటి కొన్ని రాశులవారికి ఈ రోజు చావు తప్పదని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎలా మొదలైంది. అసలు ఇందులో నిజం ఎంత?

ఈసారి చంద్రగ్రహణం రోజు, చంద్రుడు ఎరుపు రంగులో కనిపించే అవకాశం ఉంది. సూర్యుడి కిరణాలు, భూమి మీద పడి ప్రతిఫలించడం వల్ల- ఇలా చంద్రుడు ఎర్రటి ఎరుపు రంగులో కనిపిస్తాడు. పైగా ఈ రోజు భూమికి దగ్గరగా రావడంతో, చంద్రుని ఎర్రదనం మరింత భీకరంగా కనిపిస్తుంది. అందుకే ఇలా కనిపించే చంద్రుడికి ‘బ్లడ్ మూన్‌’ అని పేరు పెట్టారు. ఇంకే! ఈ పేరు చూసిన కొంతమంది క్రియేటివిటీ పదునెక్కిపోయింది.

బ్లడ్‌ మూన్ అంటే రక్తాన్ని కోరుకునే చంద్రుడనీ, ఈ రోజు కొన్ని రాశులవారి చావు ఖాయమనీ, చాలా దారుణాలు జరుగుతాయనీ ప్రచారం మొదలుపెట్టారు. ఇలాంటి సెంటిమెంట్ల మీద వ్యాపారం చేసేవాళ్లు, ఈ భయాన్ని క్యాష్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు చావుని తప్పించుకోవాలంటే విపరీతంగా ఖర్చు పెట్టి దానాలు, జపాలు, హోమాలు చేయాలని జనాల్ని బుట్టలో వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

జాతకరీత్యా చంద్రగ్రహణం ఒకో రాశి వాళ్లకీ, ఒకో రకమైన ఫలితాన్ని ఇస్తుంది. చావులాంటి ఫలితాలు మాత్రం ఏ చంద్రగ్రహణానికీ ఉండవు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ నెల 31న ఏర్పడే చంద్రగ్రహణానికి ప్రత్యేకత ఏమీ లేదు. కాబట్టి ఈ రోజు కొత్తగా జరిగే అరిష్టమూ ఏదీ లేదు. కేవలం ‘బ్లడ్‌ మూన్’ అన్న పేరు చూసి కొంతమంది మొదలుపెట్టిన పుకార్లు ఇవి. నిజానికి ఈ బ్లడ్‌ మూన్‌ని మన పూర్వీకుడైన ఆర్యభట్టుడు కొన్ని వందల ఏళ్ల క్రితేమ కనిపెట్టారు.

చంద్రగ్రహణం తర్వాత వాతావరణంలో కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రతిసారీ ఉండే తంతే! అంతేకానీ దీని వల్ల ప్రత్యేకంగా ఏర్పడే అరష్టాలు ఏవీ ఉండవని అనుభవజ్ఞులైన జ్యోతిషులు చెబుతున్నారు. ఇలాంటి వాదాలు ప్రచారం చేయడం అంటే శాస్త్రాన్ని అవమానించడమే అని హెచ్చరిస్తున్నారు.

చంద్రగ్రహణం రోజు అల్ట్రావయలెట్‌ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటారు. అందుకనే బయట తిరిగితే నష్టమనీ, వీలైనంతవరకూ ఇంటిపట్టునే ఉండాలనీ సూచిస్తారు. ఇంటిపట్టునే ఊరికనే ఉంటే ఊసుపోదు కాబట్టి, దేవుడిని ధ్యానం చేసుకుంటూ ఆ సమయాన్ని గడపమని చెబుతారు. అంతేకానీ గ్రహణం వల్ల ఏవేవో అరిష్టాలు జరిగిపోతాయని మన పెద్దలు ఏనాడూ భయపెట్టలేదు.  https://www.youtube.com/watch?v=I3IYaQ3h7Tg