మనిషి ఇలా దిగజారిపోతాడు
మనిషి ఇలా దిగజారిపోతాడు
ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే।
సఙ్గాత్సంజాయతే కామః కామాత్క్రోధోభిజాయతే॥
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతి విభ్రమః।
స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి॥
భగవద్గీతలోని రెండవ అధ్యాయం అయిన సాంఖ్యయోగంలోని రెండు ముఖ్య శ్లోకాలివి. సంసార చక్రంలో మనిషి ఎలా కొట్టుమిట్టాడతాడో విశదీకరించే మంత్రాలివి. ఇంద్రియవిషయాలను గురించి ఆలోచించిన మనిషికి వాటి మీద ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి నుంచి కోరిక జనిస్తుంది. ఆ కోరికని సాధించే క్రమంలో కోపం ఏర్పడుతుంది. ఆ కోపం మోహానికి దారితీస్తుంది. మోహంతో యుక్తాయుక్త విచక్షణ దెబ్బతింటుంది. ఎప్పుడైతే విచక్షణ దారి తప్పుతుందో బుద్ధి సైతం నాశనమవుతుంది. బుద్ధి వినాశనంతో మనిషి దిగజారిపోతాడు.
..Nirjara