గీతాపఠనంతో సర్వ కార్యసిద్థి

 

 

గీతాపఠనంతో సర్వ కార్యసిద్థి



గీతాపఠనం సర్వ శ్రేష్టకరం.. ‘ఫలమును కోరువారు అల్పులు’ అని భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. అయితే గీతా శ్లోకములలోని మహత్తర మంత్రశక్తిని నిరూపించటానికి, సామాన్య జనులకి గీత పట్ల ఆసక్తిని కల్గించటానికి పెద్దలు గీతాశ్లోక పారాయణతో లౌకిక ఫలితాలను ఏవిధంగా పొందచ్చో చెప్పారు. ఆ విధివిధానాలు తెలుసుకుని జపిస్తే తప్పక కోరిన ఫలితాలను పొందచ్చు అంటారు విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు.
   
1. తలచిన కార్యము ఏ ఆటంకాలు లేకుండా జరగాలంటే ఈ కింది శ్లోకాలలో ఏదో ఒక దానిని జపించాలి.


ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ
(1-1)


ఈ శ్లోకాన్ని 25 వేలసార్లు 21 రోజులలో జపించగలిగితే కార్యసిద్ధి కలుగుతుందట.

సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః
(18-66)


ఈ శ్లోకాన్ని 151 సార్లు జపిస్తే అన్నిటా విజయం లభిస్తుందట.

2. ఇక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడు... ఉపశమనానికి

కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్
అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున
(2-2)


ఈ శ్లోకాన్ని 11 రోజులలో 25 వేలసార్లు జపించాలి...

3 ఇక విపత్తులు తొలగటానికి

లోకే‌உస్మింద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ
ఙ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్
(3-3)


ఈ శ్లోకాన్ని 125 వేల సార్లు 41 రోజులలో జపించాలి

4 ఇక ధనప్రాప్తికి
యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి
(5-5)


ఈ శ్లోకాన్ని 31 రోజులలో 40 వేలసార్లు జపించగలిగితే లక్ష్మీకటాక్షం కలుగుతుంది

5 సంతాన ప్రాప్తికి
నచమాంతాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ
ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు
(9-9)

ఈ శ్లోకాన్ని రోజూ జపించాల