కాషాయ రంగు ప్రయోజనాలు (Benefits of Orange Colour)
కాషాయ రంగు ప్రయోజనాలు
(Benefits of Orange Colour)
యోగులు, మునీశ్వరులు కాషాయ వస్త్రాలు ధరిస్తారు. సన్యాసులు కాషాయ వస్త్రాలు ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటో, కాషాయరంగు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుందో చూద్దాం.
కాషాయరంగు వివేకాన్ని పెంచుతుంది.
నారింజ రంగు ధరించేవారు అనుక్షణం ఆత్మ పరిశీలన చేసుకుంటారు.
సమాన తత్వాన్ని ఏర్పరచుకుంటారు.
నారింజరంగు కలతలు లేకుండా చేసి ప్రశాంత చిత్తాన్ని ఇస్తుంది.
నారింజరంగు తొందర పడకుండా ఆలోచించి మాట్లాడేందుకు తోడ్పడుతుంది.
కాషాయ రంగు ఉత్సాహాన్ని అందించి చలాకీగా ఉండేట్లు చేస్తుంది.
కాషాయ వర్ణం ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
కొందరి శరీర చాయలో నారింజరంగు ద్యోతకం అవుతుంది. ఈ తరహా వ్యక్తులు సాధారణంగా కొంచెం బొద్దుగా ఉంటారు. కొందరు మరీ ఊబకాయంతో బాధపడటం కూడా కనిపిస్తుంది.
నారింజ రంగుతో అనేక సమస్యలు, వ్యాధులు నయమౌతాయని పురాణ గ్రంధాలు వివరిస్తున్నాయి.
నారింజరంగుతో నడుంనొప్పి తగ్గుతుంది.
టీబీ, పైల్స్ లాంటి దీర్ఘకాలిక జబ్బులు నయమౌతాయి.
వాతపు నొప్పులను అరికట్టవచ్చు.
పక్షవాతం తగ్గుతుంది.
అతిమూత్ర వ్యాధి లాంటి కిడ్నీ సంబంధమైన వ్యాధులను నివారించవచ్చు.
జలుబు తదితర శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
తలనొప్పి నివారణ అవుతుంది.
నారింజరంగుతో రక్తం శుద్ధి అవుతుంది.
Benefits of saffron colour, Saffron Colour clothes, Saffron Medicinal values, Indian Sage Orange Clothes, Orange Colour Therapy. Saffron Colour Therapy, Benefits of Orange Colour