గురువారం విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఇంత అద్భుతం జరుగుతుందని తెలుసా..

 

గురువారం విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఇంత అద్భుతం జరుగుతుందని తెలుసా..

 

 

హిందూ మతంలో విష్ణువు ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది.  ముఖ్యంగా గురువారం లక్ష్మీవారం అని పిలవబడుతుంది. ఈ రోజున నియమాల  ప్రకారం విష్ణువును  ఆరాధించడం వల్ల జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలగుతాయని అంటారు.   గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించి ఉపవాసం ఉండటం వల్ల శ్రీ హరి ప్రసన్నుడవుతాడట.  అలాగే  కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

గురువారాన్ని లక్ష్మీవారం అని అంటారు.  లక్ష్మీవారం కేవలం లక్ష్మీదేవికి మాత్రమే కాకుండా విష్ణుమూర్తికి కూడా ముఖ్యమైన రోజు. సాధారణంగా గురువారం అంటే గురుదేవులకు సంబంధించి ఆరాధనలు చేస్తుంటారు. కానీ లక్ష్మీవారం అయిన గురువారం రోజు  విష్ణుమూర్తిని పూజించడం వల్ల అద్బుతం జరుగుతుంది.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే  గురువారం   బృహస్పతితో ముడిపడి ఉంటుంది.  బృహస్పతి జ్ఞానం, విజయం, వివాహం, పిల్లలు,  సంపద.. మొదలైనవాటికి  కారకుడు. జాతకంలో గురు స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి  అదృష్టం పెరుగుతుంది.  వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.

 విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి గురువారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలో అయినా విష్ణు ఆరాధన చేయవచ్చు. దీని వల్ల   జాతకంలో బృహస్పతి స్థానం కూడా బలోపేతం అవుతుంది.  గురువారం ఉదయం లేదా సాయంత్రం  సమయంలో  గురువారం రోజు ఉదయం అయినా లేక సాయంత్రం అయినా  భక్తితో విష్ణువును పూజించాలట. స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించి వీలైతే పసుపు రంగు పువ్వులను శ్రీహరికి సమర్పించాలి.   పూజ సమయంలో విష్ణు సహస్రనామాన్ని పఠించడం మాత్రం అస్సలు మర్చిపోకూడదట.  ఇలా చేయడం వల్ల  విష్ణుమూర్తి ప్రసన్నుడు అవుతాడు. దాంతో పాటు గురు బలం కూడా పెరుగుతుంది.


                                      *రూపశ్రీ.