పితృపక్షాలలో పొరపాటున కూడా ఈ ఆహారాలు తినకూడదు..!

 

 

పితృపక్షాలలో పొరపాటున కూడా ఈ ఆహారాలు తినకూడదు..!

పితృపక్షాలు భారతీయ హిందూ ధర్మంలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  15రోజుల పాటూ సాగే ఈ రోజులలో మరణించిన పెద్దలకు తర్పణం వదలడం,  పిండ ప్రదానం చేయడం వంటివి చేస్తారు.  దీని వల్ల పితృ దేవతలు శాంతిస్తారని,  వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని అంటారు. పితపక్షాలు ఆచరించే వారు దీన్ని ఒక తపస్సులాగా చేయాలి.  ఈ కాలంలో కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. కొన్ని ఆహారాలు అసలు తినకూడదు.  అవేంటంటే..

పితృ పక్షాలలో మగవారు కొన్ని ఆహార నియమాలు పాటించాలి.  వాటిని అసలు విస్మరించకూడదు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. శాస్త్ర ప్రకారం పితృ పక్షాలలో నిషేధించబడిన కొన్ని  ఆహారాలను  తినకపోవడమే మంచిది.

పెద్దవారికి తర్పణం వదిలేవారు 15 రోజుల పాటూ నూనెతో వండిన ఆహారాలు,  సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు కలిపి వండిన ఆహారాలు తినకూడదు.  ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.

శ్రాద్ద సమయంలో శ్రాద్దం నిర్వహించేవారు రాగి, ఇత్తడి లేదా ఇతర లోహ పాత్రలలో మాత్రమే ఆహారం తీసుకోవాలి.

పితృ పక్షాలలో శనగలు,  వాటితో చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.  పితృ పక్షాలు ఉన్న 15 రోజులు వీటితో వండిన కూరలు చేయడం, తినడం కూడా నిషిద్దం.

పితృపక్షాలలో ముల్లంగి, క్యారెట్ వంటి ఇతర వేరు కూరగాయలతో పాటూ రాహు గ్రహానికి సంబంధం ఉన్న తెల్ల నువ్వులు,  పొట్లకాయ, నల్ల ఉప్పు, జీలకర్ర వంటి వాటితో వండిన ఆహారాలు తినకూడదు.

పితృ పక్షాలలో పప్పు,  ముడి ధాన్యాలు, కిడ్నీ బీన్స్,  ఎర్ర కందిపప్పు,  ముందురోజు మిగిలిన ఆహారం,  సముద్రపు ఉప్పు, గేదె పాలు కూడా తీసుకోకూడదట.

పితృ పక్షాలు ఉన్న 15 రోజుల పాటూ చేదుగా ఉన్న కూరగాయలు కానీ ఆహారాలు కానీ అసలు తీసుకోకూడదట. చేదుగా ఉన్న ఆహారాలు తింటే మరణించిన పెద్దల ఆత్మలు అసంతృప్తిగా ఉంటాయట.

 ముఖ్యంగా పితృ పక్షాలలో మాంసం, చేపలు, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయ మొదలైన తామస ఆహారాలకు దూరంగా ఉండాలి.


                                                           *రూపశ్రీ.