Auspicious Salagramam
సర్వాన్నీ ప్రసాదించే సాలగ్రామం
Auspicious Salagramam
సాలగ్రామం అనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. కానీ ఈ పదానికి సరయిన అర్ధం ఏమిటో చాలామందికి తెలీదు. అందుకే దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
సాలగ్రామం అనేది ఒక రకమైన రాయి. అయితే, ఇది ఓ పురుగువల్ల.. అంటే ఓ జలచరం వల్ల తయారౌతుంది అంటే అతిశయోక్తి కాదు. సాలాగ్రామాలు చాలా చాలా అరుదైనవి. ఇవి నర్మదానదిలో దొరుకుతాయి. అలాగే ఖాట్మండు నగరానికి ఉత్తరాన గండకీనదిలో దొరుకుతాయి. ఈ గండకీనది తీరంలో ''ముక్తినాథం'' పేరుతో సాలగ్రామం ఉంది. ఈ ప్రాంతాల్లో మాత్రమే సాలగ్రామాలు దొరుకుతాయి. మరెక్కడా ఇవి లభ్యం కావు.
సంస్కృతంలో ''శిలగా మారిన శలభమే సాలగ్రామం'' అంటూ నిర్వచనం చెప్తారు. సాలగ్రామం ఎంత ఎక్కువ సంవత్సరాలు గడిస్తే అంత మహత్తరమైంది. అలాగే, ఎంత చిన్నది అయితే అంత గొప్పది. కాలం గడిచిన తర్వాత సాలగ్రామానికి ఔషధ గుణాలు వచ్చి చేరతాయి.
ఒక విధమైన పురుగు సాలగ్రామంగా రూపొందుతుంది. అయితే కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత మాత్రమే అది రాయిలా గట్టిపడుతుంది. రసాయనికంగా చూస్తే సాలగ్రామం సిలికాన్ డయాక్సైడ్. దీనికి చెకుముకి రాయి లక్షణాలు ఉంటాయి. గట్టిపడకముందు సాలగ్రామంలో సున్నపు లక్షణం ఉంటుంది.
సాలగ్రామం విశిష్ట శిలారూపం. ఇవి వేల, లక్షల సంవత్సరాలు యథాతథంగా ఉంటాయని రుజువైంది. నీళ్ళలో ఉండే ఒక జీవి సుదీర్ఘకాలం తర్వాత సాలగ్రామంగా రూపాంతరం చెందుతుంది. అంటే ఇది జరాసిక్ టెతీన్ కాలానికి చెందినది.
సాలగ్రామం సంపాదించి, దేవుడి మందిరంలో ఉంచుకుంటే ఎంతో మంచిది. దీన్ని నియమనిష్టలతో పూజించాలి. సాలగ్రామం చేసే మేలు అనన్యసామాన్యమైంది. సర్వాన్నీ ప్రసాదిస్తుంది. ఏ మంత్రాలూ రానివారు మనసునే అర్పించుకుంటూ ప్రార్ధించాలి. సాలగ్రామం ఒకవేళ పగిలిపోయినా, దాని విలువ తగ్గదు. సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని సేవించడం శ్రేష్టం.
మనం electro magnetic activity గురించి ఇదివరలో చెప్పుకున్నాం. శంఖంలోంచి తీర్ధం తీసుకోవడం, ఆచమనం, అభిషేకం లాంటి ప్రక్రియల్లో ఒకదానిలో ఉండే తత్వం మరోదానికి చేరుతుంది. ఇక్కడ కూడా అంతే జరుగుతుంది. సాలగ్రామాల్లోని అపురూపమైన శక్తి, ఔషధ గుణాలు మనకు అందుతాయి.''విత్తనంబు మర్రి వృక్షంబునకు ఎంత..'' చందంగా సాలగ్రామాల్లో సూక్ష్మ రూపంలో ఇమిడిఉన్న అపూర్వ శక్తి మనకు లభిస్తుంది.
auspicious salagramam, khatmand gandaki river and salagram, narmada river sand salagram, divine salagramam, salagram and medicinal values, muktinatham at gandaki river, salagramam hundreds of years