అష్టలక్ష్మీ స్తోత్రమ్

అష్టలక్ష్మీ స్తోత్రమ్

ఆదిలక్ష్మి
సుమనస వందిత ! సుందరి ! మాధవి ! చంద్ర సహోదరి ! హేమమయే !
ముణిగణ మండిత మోక్షవిధాయిని ! మంజుల భాషిణి ! వేదనుతే !
పంకజ వాసిని ! దేవ సుపూజిత ! సద్గుణ వర్షిణి ! శాంతియుతే !
జయజయహే మధుసూదనకామిని ! ఆదిలక్ష్మి ! పరిపాలయ మామ్

ధాన్యలక్ష్మి
అయి ! కలికల్మష నాశిని ! వైదిక రూపిణి ! వేదమయి !
క్షీర సముద్భవ మంగళరూపిణి ! మంత్రనివాసిని మంత్రనుతే !
మంగళదాయిని ! అంబుజ వాసిని ! దేవగణాశ్రిత పాదయుతే !
జయజయహే మధుసూదనకామిని ! ధాన్యలక్ష్మి ! పరిపాలయ మామ్

ధైర్యలక్ష్మి
జయవరవర్ణిని ! వైష్ణవి ! భార్గవి ! మంత్ర సురూపిణి ! మంత్రమయే !
సురగణపూజిత ! శీఘ్రఫలప్రద ! జ్ఞానవికాసిని ! శాస్త్ర నుతే !
భవభయహారిణి ! పాపవిమోచని ! సాధు జనాశ్రిత పాదయుతే !
జయజయహే మధుసూదనకామిని ! ధాన్యలక్ష్మి ! పరిపాలయ మామ్

గజలక్ష్మి
జయజయ దుర్గతినాశిని ! కామిని ! సర్వఫలప్రద శాస్త్రమయే !
రథగజ తురగపదాతి సమావృత ! పరిజన మండిత లోకనుతే !
హరిహరధాతృ సుపూజిత సేవిత తాపనివారిణి ! పాదయుతే !
జయజయహే మధుసూదనకామిని ! ధాన్యలక్ష్మి ! పరిపాలయ మామ్

సంతానలక్ష్మి
అయి ! ఖగవాహిని ! మోహిని ! చక్రిణి ! రాగవివర్ధిని! జ్ఞానమయి !
గుణగణవారిథి లోకహితైషిణి ! స్వరసప్తాంచిత గాననుతే !
సకల సురాసుర దేవమునీశ్వర మానవ వందిత పాదయుతే !
జయజయహే మధుసూదనకామిని ! ధాన్యలక్ష్మి ! పరిపాలయ మామ్

విజయలక్ష్మి
జయ కమలాసిని ! సద్గతిదాయిని ! జ్ఞానవికాసిని ! గానమయి !
అనుదినమర్చిత ! కుంకుమ పంకిల భూషిత వాసిత వాద్యనుతే !
కనకమయస్తుతి వైభవ వందిత ! శంకర దేశిక మాన్యపదే !
జయజయహే మధుసూదనకామిని ! ధాన్యలక్ష్మి ! పరిపాలయ మామ్

విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి ! భారతి ! భార్గవి ! శోకవినాశిని ! రత్నమయి !
మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాసముఖీ !
నవనిధిదాయిని ! కలిమల హారిణి కామిత ఫలద కరాబ్జయుతే !
జయజయహే మధుసూదనకామిని ! ధాన్యలక్ష్మి ! పరిపాలయ మామ్

ధనలక్ష్మి
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాదసుపూర్ణమయి !
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాదసువాద్యనుతే !
వేదపురాణ కథాగణ పూజిత వైదిక మార్గ నిదర్శయుతే !
జయజయహే మధుసూదనకామిని ! ధాన్యలక్ష్మి ! పరిపాలయ మామ్

ఇతి అష్టలక్ష్మీ స్తోత్రమ్ సంపూర్ణమ్.