శ్రీ దేవీ అపరాథ స్తోత్ర రత్నం (Sreedevee Aparatha Stotra Ratnam)
శ్రీ దేవీ అపరాథ స్తోత్ర రత్నం
(Sreedevee Aparatha Stotra Ratnam)
నమంత్రం నో మంత్రం తదపిచ నజానే స్తుతి మహో
సదాహ్వానం ధ్యానం తదపిచ నజానే స్తుతి కథా:
నజానే ముద్రాస్తే తదపిచ నజానే విలపనం
పరంజానే మాతస్త్వదనుసరణం కష్టహరణం
విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయా
విధేయా శక్యత్వాం త్తవచరణయో ర్యాచ్యుతిరభూత్
తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి
జగన్మాతా ర్మతస్తవ చరణసేవా న రచితా
నవాదత్తం దేవీ ద్రవిణమపి భూయ స్తవమయా
తథాపిత్వం స్నేహం మయి నిరుపమం మత్ర్పకురుషే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి
పృథివ్యాం పుత్రాన్తే జనని బహావస్సంతి సరళాం
పరం తేషాం మధ్యే విరళ తరళో హం తవ సుతః
మదీయో యం త్యాగ స్సముచితం మిదం నో తవ శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి
పరిత్యక్తా దేవా వివిధపర దేవాకులతయా
మయా పంచాశీతే రధిక మపనీతేతు వయసి
ఇదానీం నోమాతస్తవ యదిక్రుపానాపి భవితా
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణం
శ్వపాకో జల్పాకోభవతి మధుపాకోపమగిరా
నిరాంతంకోరంకో విహరతి చిరంకోటి తనకై
తవాపర్ణే విశతి మసువర్ణే ఫలమిదం
జనః కోజానీతే జనని జపనీయం జపవిధౌ
చిత్రభాస్మలేపో గరళమశనం దిక్తటధరో
జటాధారి కంఠే భుజగపతి హారీ పశుపతి:
కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం
భవాని త్వత్పాణి గ్రహణ పరపాటీహ ఫలమిదం
నమోక్షస్యా కాంక్షా భవతి భవ వాంచాపి చనమే
నవిజ్ఞా నాపేక్షా శశిముఖ శుఖేచ్చాపి నపునః
అత్తస్త్వాం యాచే హం జనని జననం యాతు మమవై
మృడానీ రుద్రాణీ శివశివ భావానీతి జపతః
నారాధితాసి విధినా వివిధోపచారై:
కిం రూక్ష చింతనఛయై ర్నకృతం వచోభిః
శ్యామే త్వమేవ యది కించన మయ్యనాధే
ధత్సేకృపా ముచిత మంబ పరం తవైవ
అపత్సుమగ్న స్మరణం త్వదీయం కరోమి దుర్గే, కరుణార్ణవే శివే
నైత చ్చరత్వం మమదాపయత్వం క్షుద్రా త్రుషార్తా జననీం స్మరంతి
జగదంబ విచిత్ర మంత్రం కిం పరిపూర్ణా కరుణాస్తి చే న్మయి
అపరాధ పరంపరావృతం సహిమాతా సముపేక్షతే సుతమ్