కనక వర్షం కురిపించే కనకధారాస్తవం (Kanakadhara Stavam)

 

కనక వర్షం కురిపించే కనకధారాస్తవం

(Kanakadhara Stavam)

 

ఇది జగద్గురువులు ఆదిశంకరాచార్యులు చేసిన లక్ష్మీ స్తోత్రం. దీనిని నిత్యం చదివితే లోతులేని ఐశ్వర్యం లభిస్తుందని ఫలశృతి.

శ్రీ శంకరాచార్యులవారు తన బాల్యంలో, భిక్షకు వెళ్ళినప్పుడు ఒకరోజు ఒక బీదరాలైన ముసలమ్మ ఇంటికి వెళ్ళారు. స్వామికి భిక్ష ఇవ్వడానికి ఆ వృద్దురాలి దగ్గర ఏమీ లేకపోవడం వల్ల ఆమె ఎంతో బాధపడింది. ఏమీ లేదని చెప్పి పంపలేక ఇల్లంతా వెతికి, ఇంట్లో ఉన్న ఒక్క ఉసిరికాయని తెచ్చి, శంకరాచార్యుల వారికి భిక్షగా వేసింది. ఆమె భక్తికి, ఉదారతకి హృదయం ద్రవించిన ఆది శంకరాచార్యులు, ఆమె దారిద్యం తొలగడానికి లక్ష్మీ దేవిని స్తుతించారు. ఆ స్తోత్రానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ బీదరాలి ఇంటిలో బంగారు దారని కురిపించింది.

ఆ స్తోత్రమే ఎంతో మహిమగల ఈ కనకధారా స్తోత్రం ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించేవారికి, లక్ష్మీదేవి ప్రసన్నురాలై సర్వాభిష్టాలను సిద్ధింపచేస్తుంది.

అంగ హరే: పులక భూషమాశ్రయంతీ

భ్రుంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్

అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా

మాంగల్యదాస్తు మమ మంగళదేవాతాయా

మొగ్గలతో నిండి వున్న చీకటి కానుగ(చెట్టు)కు ఆడ తుమ్మెదలు ఆభరణాలైనట్టు, పులకాంకురాలతో వున్న శ్రీహరి శరీరాన్ని ఆశ్రహించినదీ, సకలైశ్వర్యాలకు స్తానమైనదీ అయిన లక్ష్మీదేవి యొక్క చక్కని క్రీగంటి చూపు నాకు శభాలనే ప్రసాదించుగాక!

ముగ్ధా ముహుర్విదధతీ పదనే మురారే:

ప్రేమత్రపా ప్రణిహితాని గతగతాని,

మాలా దృశో: మధుకరీన మహోత్పలేయా

సామే శ్రియం దిశతు సాగర సంభవాయా

పెద్ద నల్ల కలువపై వుండే తుమ్మెదలా శ్రీ హరి ముఖంపై. ప్రేమ సిగ్గులతో ముందు వెనుకలకు ప్రసరిస్తున్న, సముద్ర తనయ లక్ష్మీ యొక్క కృపాకటాక్షము నాకు సంపదను అనుగ్రహించుగాక!

విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్ష

మానందహేతు రాధికం మురవిద్విషోపి

ఈషన్నిషీదతు మయి క్షనమీక్షణణార్ద

మిందీవరోదర సహోదర మిందిరాయా:

దేవేంద్ర పదవిని ఈయగలదీ, శ్రీ మహా విష్ణువు సంతోషానికి కారనమైనదీ. నల్లకలువలను పోలునదీ అయిన లక్ష్మీదేవి కటాక్షం కొంచెం నాపై ఉండుగాక!

అమీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద

మానందకంద మనిమేష మనంగతంత్రమ్

అకేరక స్థిత కనీనిక పక్ష్మనేత్రం

భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయా

నిమీలిత నేత్రుడై, ఆనంద కారణుడైన శ్రీ మహావిష్ణువుని సంతోషములతో చూడడం వలన రెప్పపాటు లేనిదీ, కామ వశమైనదీ కుంచితమైన కనుపాపలతో రెప్పలతో శోభిల్లునదీ అయిన శ్రీ లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగు గాక!

కాలంబుదాలి లలితోరసి కైటభారే:

ధారా ధరే స్పురతి యాతటిదంగనేవ

మాతస్సమస్తజగతాం మహానీయ మూర్తి:

భద్రాణి మే దిశతు భార్గవనందనాయా

కారుమబ్బు మీద మెరుపుతీగలా, నీల మేఘ శ్యాముడైన నారాయణుని వక్షస్థలంపై ప్రకాశిస్తున్న ముల్లోకాల తల్లి భార్గవనందన అయిన లక్ష్మీదేవి నాకు శుభాములనిచ్చుగాక!

బాహ్యంతరే మరజితః శ్రిత కౌస్తుభే యా

హారావలీవ హరినీలమయీ విభాతి

కామప్రదా భగవతోపి కటాక్షమాలా

భగవంతుడైన నారాయణునికి కామప్రదయై, అయన హృదయమందున్న కౌస్తుభమున ఇంద్రనీల మణిమయమైన హారావళివలె ప్రకాశిస్తున్న, కమలాలయ అయిన లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభములను చేకూర్చుగాక

ప్రాప్తం పద ప్రథమతః ఖాలు యత్ర్పభావత్

మాంగల్యభాజి మధుమాథిని మన్మదేన

మయ్యాపతేత్తదిహ మంథరామీక్షణార్ధం

మందాలసం చ మకరాలయ కన్యకాయా!

ఏ క్రీగంటి ప్రభావంతో మన్మధుడు మధుసూదనునియందు ముఖ్యస్థానమునాక్రమించేనో అట్టి క్షీరాబ్ధి కన్య అయిన లక్ష్మీ యొక్క చూపు నా యందు ప్రసరించుగాక!

దద్యాద్దయానుపనో ద్రవిణాంబుధారా

మస్మిన్నకించిన విహంగశిశౌ విషణ్ణేం!

దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం

నారాయణప్రణయినీ నయనంబువాహః

శ్రీమన్నారాయణుని దేవియైన లక్ష్మిదేవి దృష్టి అనే మేఘం, దయ అనే వాయువుతో ప్రేరితమై, నాయందు చాలాకాలంగా వున్న దుష్కర్మ అనే తాపాన్ని తొలగించి, పేదవాడినన్న విచారంతో చాతకపు పక్షి వలెనున్న నాపై ధనవర్ష ధారను కురిపించుగాక!

ఇష్టా విశిష్టమతయోపి మయా దయార్ద్ర

దృష్టా స్త్రివిష్టస పదం సులభం భజంతే!

దృషి: ప్రవృష్ట కమలోదర దీప్తిరిష్టాం

పుష్టి కృషీష్ట మమ పుష్కర విష్టరాయా:!

పద్మాసని లక్ష్మీదేవి దయార్ద్ర దృష్టివలెనే విశిష్టులైనవారు సులభంగా ఇంద్రపదవిని పొందుతున్నారు. వికసించిన పద్మంలా ప్రకాశించే ఆ దృష్టి. కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక!

గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి

శాంకభరీతి శశిశేఖర వల్లభేతి!

సృష్టిస్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై

త తస్యై నమస్త్రి భువనైక గురోస్తరున్యై!

వాగ్దేవ (సరస్వతి) అనీ, విష్ణు సుందరి అనీ, శాంకభారీ అనీ, శాశిరేఖవల్లభా అనీ పేరు పొందినదీ, సృష్టి, స్థితి లయముల గావించునదీ త్రిభువనాలకు గుర్వైన విష్ణువు యొక్క పట్టపురాణి అయిన లక్ష్మిదేవికి నమస్కారము.

శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై

రాత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై

శక్యై నమోస్తు శతపత్ర నికేతనాయై

పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై!

పుణ్యకార్యాల ఫలము నొసగి శృతిరూపిణి, సౌందర్యగుణ సముద్ర అయిన రతి రూపిణి, పద్మనివాసిని అయిన శక్తి రూపిణి, నారాయణుని వల్లభా లక్ష్మిదేవికి నమస్కారమ్.!

నమోస్తు నాళీకవిబావనాయై

నమోస్తు దుగ్దోదధిజన్మ భూమ్మ్యై

నమోస్తు సోమామృతసోదరాయై

నమోస్తు నారాయణ వల్లభాయై

పద్మాన్ని బోలిన ముఖముగలదీ క్షీరసాగర తనయ, చంద్రునకు అమృతమునకు తోబుట్టువైనదీ, నారాయణపత్ని అయిన లక్ష్మిదేవికి నమస్కారము.

నమోస్తు హేమంబుజపీఠికాయై

నమోస్తు భూమండలనాయకయై

నమోస్తు దేవాదిదయాపరాయై

నమోస్తు శార్ఘాయుధ వల్లభాయై

బంగారు పద్యం ఆసనంగా కలది. భూమండల నాయిక దేవతలను దయచూచునది, విష్ణుపత్నియైన లక్ష్మిదేవికి నమస్కారము. నమోస్తు దేవ్యైభ్రుగునందనాయై నమోస్తు విష్ణోరరురస్థితాయై నమోస్తు లక్ష్మ్తే కమలాలయాయై నమోస్తు దామోదర వల్లబాయై! భ్రుగుమహర్షి పుత్రిక, విష్ణు వక్షస్థల నివాసిని పద్మాలయ, విష్ణుప్రియ లక్ష్మీదేవి నమస్కారం

నమోస్తు కాంతై కమలేక్షణాయై

నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై!

నమోస్తు దేవాదిభిరర్చితాయై

నమోస్తు నందత్మాజ వల్లభాయై

పద్మములవంటి కన్నులగలది, దేదీప్యమానమైనది, లోకాలకు తల్లి, దేవతల పూజలందుకోనునది, నందాత్మజుని ప్రియురాలు శ్రీమహాలక్ష్మీకి నమస్కారం.

సంపత్కరాణి సకలేంద్రియనందనాని

సామ్రాజ్యదాన నిరతాని సరోరుహక్షి

త్వద్వందనాని దురిరాహరనోద్యతాని

మామేవ మాతరవిశం కలయంతు మాన్యే!

పద్మాక్షి! నిన్ను గూర్చి చేసిన నమస్కారం సంపదను కలిగిస్తాయి. సకలేంద్రియాలకు సంతోషాన్ని కలిగిస్తాయి. చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తాయి. పాపాలను నశింపచేస్తాయి. ఓ తల్లి! ఎల్లప్పుడు నన్ను అనుగ్రహించుగాక!

యత్కటాక్ష సముపాసనా విధి:

సేవకన్య సకలార్ధసంపదః

సంతనోతి వచనాంగ మానసై:

త్వాం మురారి హృదయేశ్వరీం భజే

ఏ దేవి కటాక్ష వీక్షణంతో దేవకులకు సకలార్థ సంపదలు లభిస్తాయో, అట్టి మురారి హృదయేశ్వరి లక్ష్మీ దేవిని, మనోవాక్కాయమూలతో త్రికరణ శుద్ధిగా సేవించేదను.

సరసిజనయనే సరోజహస్తే

ధవళమాంశుక గంధమాల్యశోభే!

భగవతి హరివిల్లభే మనోజ్ఞే

త్రిభువన భూతకరి ప్రసీదమహ్యామ్!

పద్మాక్షీ! చేతియందు పద్మము ధరించి, తెల్లని వస్త్రంతో, గంధ పుష్పమాలికాదులతో ప్రకాశించుచున్న భగవతి! విష్ణుప్రియా! మనోజ్ఞురాలా! ముల్లోకాములకు సంపదను ప్రసాదించు మాతా! నన్ననుగ్రహించు.

దిగ్ఘస్తిభి: కనక కంభముఖావసృష్ట

స్వర్వాహిని విమలచారుజల్లాప్లుతాంగిమ్

ప్రాతర్నమామి జగతాం జననీం, అశేష

లోకదినాథ గృహిణీం అమృతాబ్ది పుత్రీమ్!

దిగ్గజాలు బంగారు కుంభాలతో తెచ్చిన నిర్మలమై ఆకాశ జలాలతో అభిషేకించబడిన శరీరము గల లోక జనానికి, విశ్వా ప్రభువైన విష్ణువు యొక్క గృహిణికి, క్షీరసాగర పుత్రికయైన మహాలక్ష్మికి ఉదయమునే నమస్కరించుచున్నాము.

కమలే కమలాక్షవల్లభే త్వం

కరుణా పూరతరంగైరపాంగై:

అవలోకయ మామకించనానాం

ప్రథమ పాత్రమక్రుతిమం దయాయాః

విష్ణువల్లభురాలివైన మహాలక్ష్మి!దరిద్రులలో ప్రథముడును, నీ దయకు తగిన పాత్రమును అగు నన్ను నీ కరుణా కటాక్షంతో చూడు.

ఫలశృతి:

స్తువంతి యే స్తుతిభిరమూభిరస్వాహం

త్రాయిమయిం త్రిభువన మాతరం రామమ్!

గుణాధికా గురుతర భాగ్యభాగినో

భవంతి తే భువి బుధభావితాశయాః!

వేదరూపిణి, త్రిలోకమాత అయిన శ్రీ మహాలక్ష్మీని ప్రతిదినం ఈ స్తోత్రంతో స్తుతిస్తారో వారు విద్యాంసులచే భావించబడే ఉన్నతులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలురావుతున్నారు.

సువర్ణధారా స్తోత్రం యచ్చంకరాచార్య విరచితం!

త్రిసంధ్య యః పఠేన్నిత్యం సకుబేర సమోభవేత్

శ్రీ శంకరాచార్య రచించిన ఈ కనకధారా స్తోత్రాన్ని ప్రతిదినం త్రికాలాలలో పఠించుచువాడు కుబేరులతో సమానుడౌతాడు.

సర్వేజనాః సుఖినో భవంతు.