Read more!

అద్భుతాలు చేసే పాదరస గణపతి

 

పాదరసం అంటే చైతన్యానికి ప్రతీక. పాదరస గణపతి మహా శక్తివంతమైంది. పాదరసం ఒకచోట స్థిరంగా నిలవకుండా పారుతూ ఉంటుంది కనుక దీన్ని ''పారద'' అని కూడా అంటారు.స్థిరంగా నిలవకుండా సర్వత్రా ప్రవహిస్తూ ఉంటుంది కనుక పారద గుణాన్ని విశ్వవ్యాపకత్వం అన్నారు.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, దుర్గాదేవి, లక్ష్మీదేవి, గణపతి తదితర దేవుళ్ళు విశ్వవ్యాప్త గుణం ఉంది. వీరంతా అయోనిజులు. అంటే మాతృగర్భం లోంచి పుట్టినవారు కాదు. స్వయమ్భువులుగా ఉద్భవించారు. పాదరస గణపతి అమూల్యమైంది, అద్భుతమైంది. ఈ పాదరస గణపతిని పూజించడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో చూద్దాం.

--> పాదరస గణపతిని పూజా మందిరంలో ప్రతిష్టించుకుని పూజించేవారి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

--> పాదరస గణపతిని అర్చించేవారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.

--> పాదరస గణపతిని నమ్ముకున్న వారికి అకాల మృత్యుభయం ఉండదు.

--> పాదరస గణేశుని ప్రార్థించినట్లయితే అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి.

--> పారద విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించేవారికి ఏ సమస్యలూ, చిరాకులూ తలెత్తవు.

--> ''ఓం లంబోదరాయ నమః'' అనే మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే అత్యున్నత స్థితికి చేరుకుంటారు.