ఏకాదశి వ్రతం పాటించకపోయినా.. ఈ 5పనులు చేస్తే.. సుఖసంతోషాలకు లోటుండదు!
ఏకాదశి వ్రతం పాటించకపోయినా.. ఈ 5పనులు చేస్తే.. సుఖసంతోషాలకు లోటుండదు!
ఏకాదశి వ్రతం ఎంతో పుణ్యపదమైనది. ఏ పండుగకు, పుణ్య తిథికి ఉపవాసం ఉన్నా లేకపోయినా.. ఏకాదశి తిథి రోజు ఉపవాసం ఖచ్చితంగా ఉండాలని, ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే.,. అన్ని రకాల పండుగలు, పుణ్య తిథులను ఆచరించిన ఫలితం లభిస్తుందని, ఏకాదశి వ్రతాన్ని,ల ఉపవాసాన్ని ఆచరించకపోతే.. మిగతా ఎన్ని ఉపవాసాలు, వ్రతాలు ఆచరించినా ఫలితం ఉండదని చెబుతారు.ల అయితే ఏకాదశి ఉపవాసానికి, వ్రతానికి కూడా కొన్ని చిన్న ప్రత్యామ్నాయాలు సూచించారు పండితులు, ఏకాదశి వ్రతం ఆచరించలేని వారు కనీసం కొన్ని పనులు చేయడం వల్ల ఏకాదశి వ్రతం ఆచరించినంత పుణ్యం, ఫలితం రాకపోయినా.. జీవితంలో సుఖసంతోషాలకు లోటు లేకుండా.. ఎంతో ఆనందంగా ఉండేలా విష్ణుమూర్తి ఆశీర్వాదం లభిస్తుందని అంటున్నారు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే..
సాత్విక ఆహారం..
ఏకాదశి చాలా పవిత్రమైన రోజు, కాబట్టి ఈ రోజున సాత్విక ఆహారం మాత్రమే తినడం ఉత్తమం. ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం లేదా మత్తు కలిగించే ఏ పదార్థానికైనా దూరంగా ఉండాలి. ఇవన్నీ తామసిక ఆహారాలు.. వీటికి దూరం ఉండటం మంచిది.
క్షవరం
ఏకాదశి రోజున గోళ్లు కత్తిరించుకోవడం లేదా జుట్టు కత్తిరించుకోవడం నిషిద్ధం. అలాగే, ఈ రోజున బట్టలు ఉతకడం కూడా మానుకోవాలని పండితుల మాట. కొందరు మాత్రం తలస్నానం చేయడం కూడా నిషిద్దం అని అంటారు. తలస్నానం చేయడం వల్ల శరీరం అలసిపోతుందని, శరీరం విశ్రాంతి కోరుతుందని, దీని వల్ల నిద్రపోయ అవకాశాలు ఉంటాయని అంటారు.
కోపం, ప్రతికూల ఆలోచనలు..
ఏకాదశి జీవితంలోకి సానుకూలతను, స్వచ్ఛతను తీసుకువస్తుంది, కాబట్టి ఈ రోజున ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరితోనూ గొడవపడటం లేదా వాదించడం చేయకూడదు.
విష్ణుమూర్తి స్మరణ..
వీలైనంత ఎక్కువగా విష్ణుమూర్తిని స్తుతిస్తూ కీర్తనలు పాడటం కూడా చాలా గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. ఆయన నామాన్ని జపించడం కూడా మంచిది. "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని జపించడం లేదా విష్ణు సహస్రనామాన్ని పఠించడం ఎంతో ఉత్తమం.
పేదలకు సహాయం..
హిందూ మతం ప్రకారం, మన శక్తి మేరకు పేదలకు, అవసరమైన వారికి దానం చేసినప్పుడే ప్రతి ఉపవాసానికి పూర్తి పుణ్యం లభిస్తుంది. ఏకాదశి నాడు, ఒక పేద లేదా అవసరమైన వ్యక్తికి సహాయం చేయాలి. వారికి భోజనం పెట్టడం లేదా డబ్బు దానం చేయడం మంచిది. ఏకాదశి నాడు చేసే దానధర్మాలు ప్రత్యేక ప్రతిఫలాలను అందిస్తాయి , జీవితంలో సానుకూలతను, శ్రేయస్సును తీసుకువస్తాయి.
*రూపశ్రీ.