పతంజలి చెబుతున్న చిట్కా
పతంజలి చెబుతున్న చిట్కా
మైత్రీ కరుణాముదితోపేక్షాణాం
సుఖదుఃఖపుణ్యాపుణ్య విషయాణాం
భావనాతశ్చిత్త ప్రసాదనమ్॥
సుఖాన్ని కలిగించే విషయాల పట్ల స్నేహంతో మెలగాలి; దుఃఖాన్ని కలిగించే విషయాల పట్ల కరుణను ప్రదర్శించాలి; పుణ్యాన్ని కలిగించే విషయాల పట్ల సంతోషం కలిగి ఉండాలి; పాపాన్ని కలిగించే అంశాల పట్ల అభావంగా (నిర్లిప్తంగా) ఉండాలి. ఈ తరహా అభ్యాసాన్ని సాగించినప్పుడు క్రమేపీ మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని పతంజలి తన యోగసూత్రాలలో చెబుతున్నాడు.