శ్రీ దుర్గాదేవి అష్టోత్తర శతనామ స్తోత్రమ్
శ్రీ దుర్గాదేవి అష్టోత్తర శతనామ స్తోత్రమ్
ఓం దుర్గా శివా మహాలక్ష్మీ ర్మహాగౌరీ చ చండికా
సర్వజ్ఞ సర్వలోకేశీ సర్వకర్మ ఫలప్రదా
సర్వతీర్థమయీ పుణ్యా దేవయో రయోనిజా
భూమిజా నిర్గుణాధార శక్తిజ్ఞానీశ్వరీ తథా !!
నిర్గుణా నిరహంకారా సర్వగర్వ విమర్దినీ
సర్వలోకప్రియా వాణీ సర్వ విద్యాధిదేవతా
పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ
తేజోవతీ మహామాతా కోటిసూర్య సమప్రభా !!
దేవతా వహ్నిరూపా భవసతీ జార్ణవన రూపిణీ
గుణాశ్రయా గుణామధ్యా గుణత్రయ వివర్జితా
కర్మజ్ఞానప్రదా కాంతా సర్వ సంహార కారిణీ
సర్వజ్ఞానా ధర్మనిష్ఠా సర్వకర్మ వివర్జితా !!
కామాక్షీ కామసంహంత్రీ చ కామక్రోధ వివర్జితా
శాంకరీ శాంభవీ శాంతా చంద్ర సూర్యాగ్ని లోచనా
సృజయా జయ భూమిశా జాహ్నవీ జనపూజితా
సర్వశాస్త్రమయీ నిత్యశుభ చంద్రార్ధ మస్తకా !!
భారతీ భ్రామరీ కల్పకరాళీ కృష్ణపింగళా
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృత పరివృతా
జ్యేష్ఠీందిరా మహామాయా జగత్సృష్ట్యధికారిణీ
బ్రహ్మాండకోటి సంస్థానా కామినీ కమలాలయా !!
కాత్యాయనీ కళాతీతా కాల సంహార కారిణీ
యోగనిష్ఠా యోగగమ్యా యోగిధ్యేయా తపస్వినీ
జ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్ట ఫలప్రదా
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ !!
శార్వరీ మధ్యగాతా షడాధారాధిత శోధినీ
మోహితాం శుభ వా శుభ్రా సూక్ష్మమాతా నిరాలసా
నిమగ్నా నీలసంకాశ నిత్యానంద హరా హరా
సర్వజ్ఞాన ప్రదానందా సత్యదుర్లభ రూపిణీ
సరస్వతీ సర్వగతా సర్వాభీష్ట ప్రదాయినీ !!
ఈ దుర్గాష్టోత్తర స్తోత్రాన్ని చదివినా, వినినా సమస్త పాపాలు పోతాయి. విజ్ఞాన వికాసాలు కల్గుతాయి. మనసారా నమ్మి స్తుతించినా సర్వరోగ విముక్తులై సర్వాభీష్టసిద్ధి పొందుదురు.