శ్రావణపౌర్ణమి... ప్రాధాన్యత

 

శ్రావణపౌర్ణమి... ప్రాధాన్యత


                             -రచన : యం.వి.ఎస్

శ్రావణపౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత వుంది.
నిండు చంద్రుడు క్షీరసాగర సంజాతుడు. అతని సోదరి శ్రీమహాలక్ష్మి కూడా క్షీరసాగర సముద్భవ. పౌర్ణమినాడు చంద్రుడు పదునారు కళలతో విరాజిల్లుతూ వుంటాడు. శ్రీమహాలక్ష్మి కూడా షోడశకళాపరిపూర్ణjైు పూజలందుకుంటూ భక్తులకు సిరిసంపదలు ప్రసాదిస్తూంటుంది. అంతేకాదు. శ్రావణపౌర్ణిమ మూడు పండుగల సమాహారం. అందులో మొదటిది ‘హయగ్రీవ జయంతి’, రెండవది ‘రక్షాబంధనం’ (రాఖీ పండుగ) మూడవది
‘జంధ్యాలపౌర్ణమి’.

హయగ్రీవ జయంతి

 


పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు, వేదాలను అపహరించి సముద్రగర్భంలో దాక్కున్నాడు. వాడి తల గుఱ్ఱపుతల. అందుకే వాడికి హయగ్రీవుడు అనే పేరు వచ్చింది. వాడికి తనలాంటి ఆకారం వున్న వాని చేతిలోనే చావాలని వరం వుంది. అందుకే శ్రీమహావిష్ణువు హయగ్రీవుడై ఆ అసురుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మదేవునకు అనుగ్రహించాడు. ‘వేదం’ అంటే ఙ్ఞానం. ఙ్ఞానసంపదను సంరంక్షించినవాడు ‘హయగ్రీవుడు’. అందుకే ఆయన ఙ్ఞానానికి అధిదేవత అయ్యాడు. శ్రీమహావిష్ణువు ‘హయగ్రీవుని’గా అవతరించినది ఈ ‘శ్రావణపౌర్ణమి’ రోజునే. కనుక శ్రావణపౌర్ణమిని ‘ఙ్ఞానపౌర్ణమి’ అని కూడా అంటారు. అందుకే``
          

ఙ్ఞానానందమయందేవం ా నిర్మలస్ఫటికాకృతిమ్‌
      ఆధారం సర్వవిద్యానాం ` హయగ్రీవ ముపాస్మహే


ఇలా భక్తిగా స్తుతించడమే ఆ స్వామిని ఆరాధించడం. అదే నిజంగా ఆ స్వామికి మనం చేసే అసలు సిసలైన జన్మదిన వేడుక.

 

రక్షాబంధనం (రాఖీ పండుగ)

 

 


సోదరుల క్షేమాన్ని కాంక్షించి అక్కాచెల్లెళ్ళు, శ్రీమహావిష్ణువును ధానిస్తూ తమ సోదరుల చేతికి రక్ష కట్టే పండుగ ఇది. అందుకే ఈ పండుగను ‘రక్షాబంధనం’ అన్నారు. ఈ పండుగను మనం జరుపుకోవడానికి ఓ పురాణ ఆధారం కూడా వుంది. అదేమిటంటే`` దేవదానవ సంగ్రామ సమయంలో అసురగురువు శుక్రాచార్యుని సహకారంతో రాక్షసులు విజృంభించి దేవతలను సంహరించడం మొదలుపెట్టారు. దానితో దిక్కుతోచని ఇంద్రుడు భార్య శచీదేవి దేవగురువైన బృహస్పతిని శరణుకోరగా. ‘నూలుతో చేసిన ఓ దారాన్ని శ్రీమహావిష్ణువు
మంత్రంతో మంత్రించి శ్రావణపౌర్ణమి రోజున నీ భ్తచేతికి ‘రక్షాబంధనం’గా కట్టు’ అని సలహా ఇచ్చాడు. శచీదేవి ఆ విధంగా చేయడంతో ఇంద్రుడు యుద్ధంలో విజయం సాధించాడు. ఆనాటి నుంచీ ‘శావణపౌర్ణమి’ ‘రక్షాబంధనం’ పండుగగా మారిపోయింది. ఆ రోజున స్రీలు  పురుషుల చేతికి రక్ష కట్టడం ఆచారమయింది. రాజపుత్రవీరులు ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు. మేవాడ్‌ మహారాణి ‘కర్మవతి’ అందానికి దాసుడైన బహదూర్‌షా, ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలని నిర్ణయంచుకున్నాడు. ఈ సంగతి తెలుసుకున్న ‘కర్మవతి’ సోదరప్రమతో తనను కాపాడమని మొగల్‌ సామ్రాట్టు అయిన ‘హుమాయూన్‌’కు ‘రక్ష’ (రాఖీ) పంపించింది. హుమాయూన్‌ ఆమెను బహదూర్‌ బారినుంచి కాపాడాడు. ఆనాటి నుంచీ సోదరీలు తమ

 

సోదరుల చేతికి ‘రక్ష’ (రాఖీ)

 

 


కట్టడం ఆచారమైంది. ఆరంభంలో దారంగా వుండే రక్ష, నేటి నాగరిక సమాజంలో రకరకాల నగిషీలతో అందంగా రూపుదిద్దుకుని అందరికీ అందుబాటులోకి వచ్చింది. రాఖీని బంధించేవేళ... రాఖీని కట్టడానికి ముందు, రాఖీని పూజామందిరంలో వుంచి, దానికి భక్తిగా విష్ణుపూజ చేసి, హారతినిచ్చి, ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ రక్ష కట్టి, తీపి తినిపించి, వారినుంచి కానుకలు, దీవెనలు అందుకోవాలి.
             

ఏన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబల్ణ
          తేన త్వామభి బధ్నామి రక్ష మాచల మాచల


అంటే....‘మహాబలవంతుడు, దానవేంద్రుడు అయిన బలిచక్రవర్తిని, త్రివిక్రముడైన వామనుడు తన విష్ణుశక్తితో బంధించినట్లు, ఓ రక్షాబంధనమా! చలించక స్ధిరంగా వుంటూనా సోదరుల ఆయురారోగ్యాలను కాపాడుతూ, వివిధ ఉపద్రవాలనుంచి రక్షిస్తూ, వారికి అష్టైశ్వర్యాలు కలిగించాలని ప్రార్ధిస్తూ నిన్ను నా సోదరుల చేతికి బంధిస్తున్నాను.’ అని అర్ధం. రాఖీపండుగ ఎంతో అనుబంధంతో, అనురాగంతో, ఆప్యాయతతో కూడుకున్న
పండుగ. ఎలాగైతే సోదరుల చేతికి రక్ష కడతారో, అలాగే సోదరులు కూడా తమ అక్కచెల్లెళ్ళ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ వారికి కలకాలం అండగా నిలబడాలి. అదే నిజమైన రక్షాబంధనం ` అదే నిజమైన సోదరానుబంధం.                 

జంధ్యాలపౌర్ణమి

 

 

 


శ్రావణపౌర్ణమిని ‘జంధ్యాలపౌర్ణమి’ అని కూడా అంటారు. యఙ్ఞోపవీధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణపౌర్ఱమినాడు, విధిగా నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలి. ఎందుకంటే, యఙ్ఞోపవీతంగల ప్రతివారు, నిత్యకర్మానుష్ఠాన యోగ్యతకోసం, ప్రతినిత్యం సంధ్యావందనం చేసితీరాలి. కానీ, ఏదోఒక కారణంగా, ఏదోఒక సందర్భంలో తెలిసో తెలియకో, ఈ నియమానికి భంగం జరిగే అవకాశం వుంది. ఒకవేళ అదే జరిగితే, ధరించిన యఙ్ఞోపవీతం శక్తిహీనమైపోతుంది. అటువంటి పరిస్థితిలో నూతన యఙ్ఞోపవీతిన్ని ధరించాలి. ఇలాంటి పొరపాట్లనుసరిదిద్దడానికే ‘శ్రావణపౌర్ణమి’ నాడు నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలనే నియమాన్ని
మన పూర్వులు ఓ ఆచారంగా ఏర్పాటుచేసారు.ఎవరు ఎన్ని ముడులు ధరించాలి? బ్రహ్మచారి ఒక ముడి వున్న జంధ్యాన్ని ధరించాలి. గృహస్థుడు మూడుముడులు ధరంచాలి. అయితే కొందరు నాలుగు ముడులు, ఐదు ముడులు కూడా ధరిస్తూంటారు.
- మొదటిపోగు..., వైదిక నిత్యకర్మానుష్ఠానం కోసం,
-  రెండవపోగు...,గృహష్థాశ్రమ ధర్మాచరణ కోసం,
-  మూడవపోగు...,ఉపాకర్మ రోజున ఉపాంగవస్త్రంగా ధరించడంకోసం,
-  నాల్గవపోగు...,తప్పనిసరి పరిస్థితిలో దానం చేయడం కోసం,
-  ఐదవపోగు..., పాముకాటుకుగురైన వారి కాలికి కట్టడానికి ఉపయోగంచేవారు.

యఙ్ఞోపవీతధారణ విధి


నూతన యఙ్ఞోపవీతానికి ఐదు చోట్ల కుంకుమ బట్లు పెట్టి, సంకల్పం చెప్పి, షోడశోపచారవిధులతో పూజ చేసి ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ, ఒక్కొక్క ముడిని విడివిడిగా శిరస్సుపైనుంచి
ధరించాలి.
        యఙ్ఞోపవీతం పరమం పవిత్రం ా ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్‌
       ఆయుష్యమగ్య్రం, ప్రతిముంచ శుభ్రం ా యఙ్ఞోపవీతం బలమస్తు తేజ్ణ


‘‘సృష్టికర్త అయిన చతుర్ముఖ ప్రజాపతి సహజసిద్ధంగా ధరించిన యఙ్ఞోపవీతాన్ని, వేదోక్తకర్మాచరణాధికార యోగ్యత కోసం ధరిస్తున్నాను. ఈ బ్రహ్మసూత్రం నాకు ఆయుర్వృధ్ధిని, అగ్రత్వము, నిర్మలత్వము, స్వధర్మాచరణ సామర్థ్యము, తేజ్ణప్రభావమును కలిగించు గాక’’ అని అర్థం.   ఈ విధంగా యఙ్ఞోపవీతం ధరించిన తర్వాత, పాత యఙ్ఞోపవీతాన్ని, కొత్త యఙ్ఞోనవీతాన్నికలిపి, వాటి ముడులను గుప్పిట మూసిపట్టుకుని, యథాశక్త్యానుసారం గాయత్రిమంత్రాన్నిఉపాసించాలి. ఆ తర్వాత ఈ క్రింది శ్లోకం చదువుతూని
         పవిత్రవంతం యదిజీర్ణవంతం ా వేదాంతనిత్యం పరబ్రహ్మసత్యమ్‌
         ఆయుష్యమగ్య్రం, ప్రతిముంచ శుభ్రం ా యఙ్ఞోపవీతం విసృజస్తు తేజ్ణ


 పాత యఙ్ఞోపవీతాన్ని పాదాలు తగలకుండా కాళ్ళకింద నుంచి తీసి, దానిని తడిప,ి పచ్చని చెట్టుమీదకు విసిరివేయాలి. ఆ తర్వాత యథావిథి నిత్యకర్మలు ఆచరించాలి.
                       ఇది శ్రావణపౌర్ణమి విశిష్టత ప్రత్యేకత.
                                   

  -స్వస్తి-