మహేష్ ఫ్యాన్స్‌కి షాక్: ‘వారణాసి’ కొత్త రిలీజ్ ప్లాన్ ఇదే.!
Nov 24, 2026 3:48PM

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ముందుగా ప్రకటించిన ఏప్రిల్ 7, 2027 విడుదల తేదీకి సినిమా రావడం లేదని, ఆగస్టుకు వాయిదా పడిందని తెలుస్తోంది.
రాజమౌళి సినిమాలంటే విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో తన మేకింగ్ సత్తా చాటిన ఆయన.. ఈసారి మహేష్ బాబుతో అంతకుమించిన స్థాయిలో సినిమా తెరకెక్కిస్తున్నారు. అందుకే ‘వారణాసి’లోని భారీ విజువల్స్, గ్రాఫిక్స్ పనులకు మరింత సమయం అవసరమవుతోందని, ఈ కారణంగానే విడుదల తేదీని మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ సినిమా విడుదలకు సంబంధించి ప్రస్తుతం మూడు తేదీలను పరిశీలించినట్లు తెలుస్తోంది. జులై 29, ఆగస్టు 5, ఆగస్టు 12 తేదీలను ట్రేడ్ వర్గాలతో చర్చించారట. అయితే జులై చివరి వారంతో పోలిస్తే ఆగస్టులో విడుదల చేయడమే మంచిదని చిత్ర బృందంలోని పలువురు అభిప్రాయపడినట్లు వినికిడి. దీంతో ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఏప్రిల్ 7, 2027 అనేది మంచి రిలీజ్ డేట్. ఆ రోజు ఉగాది కావడం, ఆ తర్వాతి వారంలో శ్రీరామనవమి రావడంతో పండుగ సెలవులను దృష్టిలో పెట్టుకుని ఆ తేదీని ఎంచుకున్నారు. ఇప్పుడు ఆగస్టుకు మారితే ఆ పండుగ సీజన్‌ను వదులుకోవాల్సి వస్తుంది. అయితే గ్రాఫిక్స్ పనుల్లో రాజీ పడకుండా, సినిమాను మరింత క్వాలిటీగా సిద్ధం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: వారణాసి వీడియో లీక్.. ఆపిల్ చేసిన పనికి షాక్‌లో రాజమౌళి.!
‘వారణాసి’లో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు.

అయితే ఈ వాయిదా వార్తపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాజమౌళి తన సినిమాల ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తుంటారు. మరి ఈసారి కూడా ఏదైనా భారీ అప్డేట్తో విడుదల తేదీని ప్రకటిస్తారేమో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
టికెట్ ధరలు 80 శాతం తగ్గింపు.. 99కే ‘రామాయణ’ సినిమా చూసే ఛాన్స్.!
కిరణ్ అబ్బవరం రికార్డ్.. కాన్సెప్ట్ పోస్టర్లో ఇన్ని మిస్టరీలా.?
[Varanasi Postponed, August 2027, Mahesh Babu, SS Rajamouli, Priyanka Chopra]




