'భోగి' ఫస్ట్ రివ్యూ: ఒక్క సినిమాలో ఇన్ని ట్విస్టులా? బిగ్గెస్ట్ హిట్ అవుతుందా!
Nov 24, 2026 3:55PM

మాస్ అమ్మ మొగుడు అనిపించుకోవాలని శర్వానంద్ తాపత్రయ పడుతున్నాడనే విషయం 'భోగి'తో అర్థమైపోతుంది. అభిమానులు, తెలుగు సినిమా ప్రేమికులైతే శర్వానంద్ కోరిక నెరవాలని తమ ఇష్ట దైవాలని ప్రార్థిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రివ్యూ షోతో భోగి హెడ్ లైన్స్ లో నిలిచింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే, సెకండాఫ్‌లో వచ్చే రెండు ట్విస్టులు ప్రేక్షకులని ఆశ్చర్యపరిచాయని సమాచారం. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సాగుతుందని, దర్శకుడు సంపత్ నంది కథను ఆసక్తికరంగా నడిపించారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కథలో వచ్చే మలుపులు ప్రేక్షకులను సీట్లకి అతుక్కుపోయేలా చేస్తాయని అంటున్నారు.. కథను ఊహించని మలుపు తిప్పే ఈ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనే ప్రచారం సైతం జరుగుతోంది.
ఇప్పటివరకు శర్వానంద్‌ను ఎక్కువగా ఫ్యామిలీ, లవ్, ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో చూసిన ప్రేక్షకులకు 'భోగి'లో ఆయన పాత్ర కొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. మరి నిజంగానే ఈ సినిమా ఆయన కెరీర్లో ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుందా? అనేది థియేటర్లలో ప్రేక్షకుల స్పందనను బట్టి తేలనుంది.

1960ల కాలంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని 'బొగ్గుల గుట్ట' అనే గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ఇందులో కమ్మరి గంగ పాత్రలో శర్వానంద్ కనిపించనున్నాడు తన ఐదుగురు చెల్లెళ్లే ప్రపంచంగా భావించే గంగ.. కుటుంబం కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే వ్యక్తి.
ఇది కూడా చదవండి: తెలుగు సినిమాలకి అనిరుధ్ మ్యూజిక్ కలిసి రావట్లేదా? ఇవిగో ప్రూఫ్స్!
అదే గ్రామంలో సులోచన రాణి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించనున్నారు. మరోవైపు మందారం పాత్రలో డింపుల్ హయతి తన గ్లామర్‌తో ఆకట్టుకోనున్నారు. గ్రామాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేసే భూస్వాములు, అమావాస్య పూజల చుట్టూ తిరిగే రహస్య సంఘటనలు కథలో కీలకంగా ఉండనున్నాయి.
మూఢనమ్మకాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? గ్రామ ప్రజలను భూస్వాముల చెర నుంచి గంగ ఎలా కాపాడాడు? అతని జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
'భోగి' కి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాలోని కొన్ని హింసాత్మక సన్నివేశాలు, డైలాగ్స్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే కథ క్యారక్టర్ ల స్వభావం దృష్ట్యా వాటిలో మార్పులు చేయడానికి చిత్రబృందం అంగీకరించలేదని సమాచారం.

ఇక సినిమా రన్‌టైమ్ 2 గంటల 34 నిమిషాలు. అంటే 154 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించాడు . భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్. నవంబర్ 27 అంటే ఈ శుక్రవారం రిలీజ్ డేట్.
మీకు నచ్చవచ్చు
ధనుష్ ఓం కి నిరాశ తప్పదా!
డింపుల్ హయాతి పెళ్లి!
[Bhogi, Sharwanand , Anupama Parameswaran, Dimple Hayathi, Sampath Nandi]
Bhogi Movie First Review




